40.2 C
Hyderabad
May 2, 2024 18: 15 PM
Slider ఖమ్మం

తొలి అమరవీరుడు దొడ్డి కొమరయ్య

#komaraiah

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరవీరుడు దొడ్డి కొమరయ్య అని రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు అన్నారు.  ఐడిఓసి సమావేశ మందిరంలో  బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన దొడ్డి కొమరయ్య జయంతి వేడుకల్లో  డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్ లతో కలిసి చైర్మన్, దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య అన్నారు. దొడ్డి కొమరయ్య జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండి గ్రామంలో 1927 ఏప్రిల్ 3న జన్మించారని అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటం ప్రారంభమవడానికి, భూమికోసం, భుక్తి కోసం, విముక్తి ఉద్యమంగా మారడానికి దొడ్డి కొమరయ్య అమరత్వమే ప్రధాన కారణమన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మహనీయులను, పోరాటయోధులను స్మరించుకునేందుకు జయంతి, వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించుకోవడం జరుగుతుందని వారు అన్నారు. ఈ కార్యక్రమములో పాల్గొన్న రైతు బంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, బి. సి వెల్ఫేర్ అధికారి జ్యోతి నాయకులు అమరగాని వెంకటేశ్వర్లు గౌడ్,  బండారు నరేష్, మార్గం శ్రీనివాసరావు, చింతల చెరువు లక్ష్మి,  చిత్తారు సింహాద్రి, కూరాకుల వలరాజు, పెల్లూరి విజయ్ కుమార్, పి. ప్రభాకర్, ఎ.రామారావు, మేకల సుగుణా రావు, పెరుగు వెంకన్న,   మూడుముంతల గంగరాజు,  చిలకల వెంకటనర్సయ్య, వాగ్దాని నరేష్,  దేవర వెంకన్న, కాటం యాదయ్య, కాటం కొమరయ్య,  జయ్యాల రాంమల్లేశం, దయ్యాల నాగేశ్వరరావు,  మాలిగ గౌరీశంకర్, ఉపేందర్, పెద్ద కుమార స్వామి, బాలెం బిక్షం, జిల్లా అధికారులు, సిబ్బంది, బిసి కుల సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె లో పాల్గొన్న కార్మిక సంఘాలు

Satyam NEWS

ఇన్వెస్టిగేషన్: సిఏఏ వ్యతిరేక ఆందోళనల ఖర్చు రూ.120 కోట్లు

Satyam NEWS

తీవ్ర అనారోగ్య సమస్యల్లో అచ్చెన్నాయుడు

Satyam NEWS

Leave a Comment