28.7 C
Hyderabad
April 28, 2024 09: 41 AM
Slider నల్గొండ

దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె లో పాల్గొన్న కార్మిక సంఘాలు

#nationalbundh

దేశ వ్యాప్తంగా జరిగిన కార్మిక సంఘాలలో భాగంగా సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ నియోజకవర్గ కేంద్రంలోని మిర్యాలగూడ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు.

అనంతరం ప్రభుత్వ రంగ సంస్థలైన బ్యాంకులను బందు చేయించారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో పాల్గొన్న ఐ ఎన్ టి యు సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న గౌడ్,సి ఐ టి యు జిల్లా ఉపాధ్యక్షుడు శీతల రోషపతి,ఎ ఐ టి యు సి జిల్లా అధ్యక్షుడు జడ శ్రీనివాస్, జిల్లా నాయకుడు మేకల నాగేశ్వరరావు,టి ఆర్ ఎస్ కె వి నియోజకవర్గ అధ్యక్షుడు పచ్చిపాల ఉపేందర్,తదితర నాయకులు మాట్లాడుతూ దేశంలోని కార్మిక చట్టాలను సవరించి నరేంద్ర మోడీ కార్పొరేట్ శక్తులకు తొత్తులుగా మారారని,ఇప్పటికే 60 ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసి రక్షణ, ఇన్సూరెన్స్ రంగాలను కూడా ప్రైవేటీకరణ చేయటం సిగ్గుచేటని తీవ్రంగా విమర్శించారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని ఇప్పటికైనా నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని మాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ఐ ఎన్ టి యు సి నాయకులు బెల్లంకొండ గురవయ్య, మేరిగ గురవయ్య,ఎ ఐ టి యు సి నాయకుడు యల్లావుల రాములు,కాకి అజయ్ కుమార్,పాశం రామరాజు, మేళ్ళచెరువు ముక్కంటి,చలిగంటి జానయ్య,ఉప్పతల వెంకన్న,పాలకూరి బాబు,యాకోబ్,చింతకాయల రాము, పోతనబోయిన రాంమూర్తి,చప్పిడి సావిత్రి,యడవెల్లి వీరబాబు,ఇందిరాల వెంకటేశ్వర్లు,గురవయ్య,చందర్రావ్,గుండెబోయిన వెంకన్న,లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

ఒకే కుటుంబంలో 11 మంది ఆత్మహత్య

Satyam NEWS

కోటి ఎకరాలకు సాగునీరు అందించడంలో ప్రగతి

Satyam NEWS

పాపాగ్ని నది పొంగడం తో రాకపోకలు బంద్

Satyam NEWS

Leave a Comment