40.2 C
Hyderabad
May 6, 2024 18: 20 PM
Slider ఖమ్మం

మున్నేరు వరద బాధితులకు గృహ వినియోగ వస్తువులు పంపిణి

#Minister Puvwada Ajay Kumar

మున్నేరు వరద బాధితులకు ఐటీసీ సహకారంతో గృహ వినియోగ వస్తువుల పంపిణి కార్యక్రమంలో బాధితులకు వస్తువులు పంపిణి చేసిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ మునుపెన్నడూ చూడని వరదలు మనం చూశాం.. రాత్రికి రాత్రి వరద తీవ్రత ప్రమాద స్థాయికి చేరుకుంది..

ఖమ్మం నియోజకవర్గ పరిధిలో ఒక్క ప్రాణ నష్టం జరగలేదు.. పాలేరు నియోజకవర్గంలో దురదృష్టవ శాత్తు అతని స్వయంకృతాపరాదం వల్లే ఒక్క ప్రాణం కోల్పోయాం. వరద ముంపు లో చిక్కుకున్న వారికి బొట్ల ద్వారా కాపాడాలని కష్టపడినా ఫలితం లేకపోవడంతో ముఖ్యమంత్రి కేసీఅర్ దృష్టికి తీసుకెళ్లి హుటాహుటిన బృందాన్ని ఖమ్మంకు తీసుకొచ్చి నిర్విరామంగా కృషి చేసి అర్థరాత్రి 3 గంటల వరకు శ్రమించి ప్రతి ఒక్కరినీ కాపాడడం జరిగింది.

ఆకరికి కోళ్లు, పెంపుడు కుక్కలను కూడా సురక్షితంగా కాపాడినం.పునరావాస కేంద్రాలు, మంచి భోజనంతో పాటు అన్ని వసతులు కల్పించాం.. మరుసటి రోజు ముంపు ప్రాంతాల్లో రోడ్లు, మురుగు, చెత్త తొలగించి మున్సిపల్ శాఖ అధ్వర్యంలో అన్ని వసతులు కల్పించిన. ముంపు బాధిత కుటుంబాలకు పువ్వాడ ఫౌండేషన్ అధ్వర్యంలో ప్రతి ఇంటికి నిత్యావసర వస్తువులు పంపిణి చేశాం..అనంతరం జరిగిన క్యాబినెట్ సమావేశంలో మున్నేరు సమస్యను వివరించగా కేసీఅర్ గారు రూ .150 కోట్లు మంజూరు చేశారు. మున్నేరు పరివాహక ప్రాంతంలోని ముంపు బాధితులకు ఇక ఇబ్బందులు రావు..

మున్నేరుకు ఇరువైపులా RCC రిటైనింగ్ వాల్ నిర్మాణం కోసం వేగంగా ప్రతిపాదనలు సిద్దం అవుతున్నాయి. అతి త్వరలో ఆయా పనులకు శంకుస్థాపన చేసి ప్రారంభిస్తాం.. శాశ్వత పరిష్కారం కోసం రూ.777 కోట్లుతో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం.. మారో మూడు చెక్ డ్యాంలు. రూ.30 కోట్లతో పద్మావతి నగర్ రంగనాయకుల గుట్ట, ప్రకాష్ నగర్ చెక్ డ్యాం వద్ద మొత్తం మూడు చెక్ డ్యాం లు నిర్మాణం చేపట్టడానికి కేసీఅర్ మంజూరు చేశారు.

మున్నేరు పై బ్రిటిష్ కాలం నాటి బ్రిడ్జి పక్కనే మారో నూతన బ్రిడ్జి నిర్మాణం కోసం రూ.180 కోట్లతో బ్రిడ్జి నిర్మిస్తాం. పేదల పరిస్థితి వివరించగా తక్షణమే స్పందించిన ఐటీసీ కంపెనీ సీఈఓ కులకర్ణి గారికి ధన్యవాదాలు.. వరద ముంపు బాధితుల కోసం రూ . 1కోటితో గృహ వినియోగ వస్తువులు అందజేసినందుకు ధన్యవాదాలు.

దీనితో పాటు మున్నేరు ముంపు బాధితులకు రూ.1.50 కోట్ల పంపిణీకి ఎర్పాటు చేసాము. ఖమ్మం నియోజకవర్గం పరిధిలోని ముంపు బాధితుల మరింత ఆదుకోవాలనే సంకల్పంతో బండి పార్థసారథి గారిని సహకారం కోరగా అడిగిన వెంటనే రూ.కోటి, కోడలు అపర్ణ తన తాత గారి కంపెనీ నుండి రూ.50 లక్షలు మొత్తం రూ.1.50 కోట్లను జిల్లా కలెక్టర్ అకౌంట్ కు నగదును బదలాయించారు.

ఆయా నగదును వరద ముంపులో గృహాలు దెబ్బతిన్న వారికి నగదు రూపంలో చెక్కులు అందజేస్తాం. అనంతరం బాధితులకు వస్తువులు పంపిణి చేశారు.కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ, జిల్లా కలెక్టర్ గౌతమ్, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, సుడా చైర్మన్ విజయ్ కుమార్, గణేష్, కార్పొరేటర్ లు కమర్తపు మురళి, మాటేటి లక్ష్మీనాగేశ్వరరావు, కన్నం వైష్ణవి ప్రసన్న, తోట గోవిందమ్మ రామారావు, దండా జ్యోతి రెడ్డి, నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, కృష్ణ తదితరులు ఉన్నారు.

Related posts

రోటరీ క్లబ్ కైలాస భూమికి లక్ష విరాళం…!

Satyam NEWS

హైదరాబాదులో అంగరంగ వైభవంగా శ్రీవారి కల్యాణం

Satyam NEWS

శిక్షణా మైదానాన్ని సందర్శించిన ఎస్పీ

Murali Krishna

Leave a Comment