33.7 C
Hyderabad
April 28, 2024 23: 03 PM
Slider కడప

కడప జడ్పీ లో దేహశుద్ధి జరిగింది మరచిపోయావా నాని

#kodalinani

నిన్నటి దినం వైసీపీ మాజీమంత్రి కొడాలి నాని కాపులను కొడకల్లారా అని దూషించడంతో రాష్ట్ర కాపుల మనోభావాలు దెబ్బతిన్నాయి వెంటనే ముఖ్యమంత్రి జగన్ జోక్యం చేసుకొని భేషరత్ గా క్షమాపణ చెప్పించాలని గ్రేటర్ రాయలసీమ

బలిజ సంఘం అధ్యక్షుడు చెన్నంశెట్టి మురళీకృష్ణ కోరారు. బుధవారం ఆయన సొంత కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం మాట్లాడుతూ రాష్ట్రంలో కాపులను లక్ష్యంగా చేసుకొని గతంలో చిరేంజివిని,పవన్ కళ్యాణ్ ను విమర్శించారు ఈ విధానం మంచిది కాదన్నారు.

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఉందంటే బలిజల మద్దతుతోనే అన్నది తెలుసుకోవాలన్నారు గత ప్రభుత్వం బలిజల సంక్షేమానికి చేసిన దాంట్లో జగన్ ప్రభుత్వం 5 శాతం చేయలేదని అయినా జగన్మోహన్ రెడ్డిని నమ్మి కాపులు వెన్నంటి ఉన్నారని గుర్తెరగాలని అన్నారు.

రాష్ట్రంలో 35 శాతం బలిజలు ఉన్నారని 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని తెలుసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి కి సమయం లేకపోతే సజ్జల రామకృష్ణ రెడ్డికి లేదా ఇతర మంత్రులకు చెప్పి కొడాలి నాని చే క్షమాపణ చెప్పించి పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

నిర్లక్ష్యం చేస్తే కాపులు వైసీపీ ప్రభుత్వానికి గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. కాపులు వైసీపీలో బానిసత్వం నుంచి బయటికి రావాలని పిలుపునిచ్చారు నాని కడప జడ్పీలో నీకు చేసిన దేహశుద్ధి మరచిపోయావా స్వర్గీయ నందమూరి హరికృష్ణ స్వయంగా క్షమాపణ చెప్పి నిన్ను కాపాడడానికి మాజీమంత్రి డాక్టర్ ఎన్ తులసిరెడ్డి సాక్ష్యం అన్నారు.

గతంలో ముఖ్యమంత్రి నీలం సంజీవ రెడ్డి కాపులను బీసీ వర్గం నుంచి తీసేసినా బాధపడలేదన్నారు 4 శాతం ఉన్న కమ్మ,రెడ్డి సామాజిక వర్గ వారు ముఖ్యమంత్రులు అవుతున్నారంటే 32 శాతం కాపులే అన్న నగ్న సత్యం గుర్తెరగాలన్నారు. ఒక ఎమ్మెల్సీ ఎంపీ ఇచ్చి కాపులకు మేళ్ళు కల్పించామని అనుకుంటే సరిపోదన్నారు

ముఖ్యమంత్రి జగన్ బలిజ సంక్షేమానికి ఏమి చేయకపోయినా పర్వాలేదు కానీ మనోభావాలు దెబ్బ తీయరాదని అన్నారు. కొడాలి నానితో క్షమాపణ చెప్పించి పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా బలిజ సంఘము కార్యదర్శి సాగబాల రెడ్డయ్య,ఉపాధ్యక్షుడు ఉప్పు శ్రీనివాసులు పాల్గొన్నారు.

Related posts

మీ కోసం దేనికైనా తెగిస్తా: జనసేన అధినేత

Satyam NEWS

మేడారం జాతరలో ఇద్దరు భక్తులు మృతి

Satyam NEWS

భారతీయ వలసదారులకు వరాలు కురిపించబోతున్న బైడెన్

Satyam NEWS

Leave a Comment