38.2 C
Hyderabad
May 5, 2024 20: 07 PM
Slider గుంటూరు

విక్టర్ ప్రసాద్ ను బర్తరఫ్ చేసే వరకూ ఉద్యమం

మహాత్మా గాంధీజీని కించపరుస్తూ అవమానకరంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ వ్యాఖ్యలకు నిరసనగా ఆర్యవైశ్య బ్రాహ్మణ ఐక్యవేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పలు జిల్లాల్లో ప్రదర్శనలు..ధర్నాలు.. రాస్తారోకో… నిర్వహించారు. నల్ల బాడ్జీలు ధరించిన ఆందోళన కారులు ప్రదర్శనలో .

నల్ల జెండాలు చేబూని ప్రదర్శనలో పాల్గొన్నారు. జాతిపితపై అవమానకరమైన వ్యాఖ్యలు చేసిన విక్టర్ ప్రసాద్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని, ఎస్సీ కమిషన్ చైర్మన్ పదవి నుంచి తొలగించడంతో పాటు చట్టపరంగా చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. గుంటూరులో జరిగిన భారీ ప్రదర్శనలో శాసనసభ్యులు మద్దాలి గిరిదర్ .. బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ పాల్గొనగా.. ఒంగోలులో జరిగిన ప్రదర్శనలో ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ పాల్గొన్నారు. ఈ విషయమై విక్టర్ ప్రసాద్ క్షమాపణలు చెప్పాలని లేనిచో రాష్ట్రవ్యాప్తంగా ఆర్యవైశ్య సంఘాలు నిరసనలు తెలియజేస్తామని ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షులు ముక్కాల ద్వారకానాథ్ హెచ్చరించడం జరిగింది.

విక్టర్ ప్రసాద్ ను ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి తొలగించి, చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని తెనాలిలో జరిగిన ఆందోళనా కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాధు ప్రతాప్ కుమార్ డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన కార్యక్రమాల్లో ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య బ్రాహ్మణ ఐక్యవేదిక నాయకులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీని కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలు ఆర్య వైశ్యు, బ్రాహ్మణ, క్షత్రియుల మనోభావాలు దెబ్బతిన్నాయని గుంటూరు ఎంఎల్ఏ మడ్డాలి గిరిధర్ అన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం విక్టర్ ప్రసాదను పదవిలో నుంచి తొలగించాలని, చట్టప్రకారం చర్యలు చేపట్టాలని మద్దాల గిరిధర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం విక్టర్ ప్రసాద్ ను ఎస్సీ కమిషన్ చైర్మన్ గా బర్తరఫ్ చేయడంతో పాటు చట్టపరమైన చర్యలు చేపట్టే వరకూ ఈ ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తంగా తీవ్రతరం చేస్తామని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ హెచ్చరించారు. మహాత్మా గాంధీని బ్రాహ్మణ వైశ్య క్షత్రియ కులాల మహిళలను గౌరవప్రదమైన చైర్మన్ హోదాలో కించపరుస్తూ మాట్లాడి దళిత సమాజంలో ఈ సామాజిక వర్గాల వారిపై చులకన భావం పెంపొందించేలా ఎస్సీ కమిషన్ కృషి చేస్తుందా అని ప్రభుత్వాన్ని శ్రీధర్ ఘాటుగా విమర్శించారు. విక్టర్ ప్రసాద్ కు ప్రభుత్వానికీ.. వైసిపి పార్టీకి ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని మంత్రి మేరుగ నాగార్జున చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

జాతికి భేషరతుగా క్షమాపణ చెప్పాలి గాంధీజీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ జాతికి భేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేకుంటే ఆర్యవైశ్యులు ఉద్యమిస్తామని ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ హెచ్చరించారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఒంగోలు వైశ్య భవన్ నందు జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు.

Related posts

శబరిమలపై పుస్తకం చిలుకూరు బాలాజీకి అంకితం

Bhavani

బాలినేనిని మంత్రి వర్గం నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలి

Satyam NEWS

రూ.200 కోట్ల క్లబ్ లో అవతార్ 2

Satyam NEWS

Leave a Comment