28.7 C
Hyderabad
May 6, 2024 00: 07 AM
Slider ఆధ్యాత్మికం

శబరిమలపై పుస్తకం చిలుకూరు బాలాజీకి అంకితం

#Chilukur Balaji

సెప్టెంబరు 2018లో, భారత అత్యున్నత న్యాయస్థానం, పునరుత్పత్తి వయస్సు (10 నుండి 50 ఏళ్ల) వయస్సు గల స్త్రీలకు ఆలయంలో ప్రవేశం కల్పించాలన్న తీర్పును అమలుచేయాలని శబరిమల ఆలయంపై వత్తిడి తెచ్చింది. కోర్టు అనాదిగా వస్తున్న సంప్రదాయాన్ని ఉల్లంఘించి, మతపరమైన మనోభావాలను దెబ్బతీసిన కారణంగా, పురుషులు మరియు మహిళా భక్తులు కేరళ అంతటా భారీ నిరసనలు చేపట్టారు.

అసలు భక్తులు నిరసనలు ఎందుకు చేపట్టారు? శబరిమల అయ్యప్పను ఆరాధించే సమాన అవకాశం మహిళలకు కూడా కల్పించారని వారికి సంతోషంగా లేదా? లేక ప్రజల దృష్టికి రాని సంగతులు ఇంకేవైనా వారికి తెలుసా?

పునరుత్పత్తి వయస్సులో ఉన్న స్త్రీలను శబరిమలలోకి ఎందుకు అనుమతించరు? అని అడిగిన వారందరికీ ఈ పుస్తకం ఒక సమాధానం. ఈ పుస్తకం శబరిమల ఆలయంలో మహిళలపై ఆంక్షల వెనుక ఉన్న శాస్త్రీయతను, మునుపెన్నడూ చర్చించని దృక్పథాన్ని అందిస్తుంది.

శబరిమలకి సంబంధించిన ఐదు దేవాలయాల సందర్శన ఆమె శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేసిందో నమోదు చేసిన రచయిత, వారి ప్రత్యక్ష అనుభవాన్ని ఈ పుస్తకంలో అందించారు. ఆయుర్వేదం, చక్రాలు, తంత్రం మరియు ఆగమ శాస్త్రం వంటి భారతదేశ సాంప్రదాయ విజ్ఞాన శాస్త్ర సంబంధిత ఆధారాల ద్వారా ఆలయ స్వభావాన్ని వివరిస్తూ, స్త్రీ దృక్కోణం నుండి శబరిమల గురించి రచించబడిన అరుదైన పుస్తకం ఇది. అదే సమయంలో, రచయిత వ్యక్తిగత అనుభవాలు ఈ లోతైన శాస్త్రాల అవగాహనను సులభతరం చేస్తాయి. ఈ పుస్తకం శబరిమల వంటి దేవాలయాలు మానవ శరీరధర్మాన్ని, ముఖ్యంగా స్త్రీల ఋతుచక్రాలను ఎలా ప్రభావితం చేస్తాయో పాఠకులకు ఒక సంగ్రహావలోకనం అందిస్తుంది. ఈ పుస్తకం హిందూ దేవాలయాల పట్ల, ముఖ్యంగా శబరిమల పట్ల ఉన్న అవగాహనను మారుస్తుంది.

తెలుగు అనువాదం: హేమలత గూడా

సిను జోసెఫ్ ‘మైత్రీ స్పీక్స్ ట్రస్ట్’ సహ-వ్యవస్థాపకురాలు మరియు మేనేజింగ్ ట్రస్టీ. ఆమె 2009 నుండి ఋతుస్రావ మరియు పునరుత్పత్తి ఆరోగ్య రంగాలలో విస్తృతమైన క్రియాశీలక పరిశోధనలు చేసారు. వారు భారతదేశం అంతటా పర్యటించి, 20,000 కంటే ఎక్కువ మంది మహిళలు మరియు యుక్తవయస్సులో ఉన్న బాలికలతో ముఖాముఖి సంభాషించి, వారు ఆచరించే ఋతుక్రమ పద్ధతులు మరియు స్త్రీల ఆరోగ్యంపై వాటి ప్రభావం గురించిన సమాచారాన్ని సేకరించారు. ఋతుక్రమ ఉత్పత్తుల ప్రచారంపై దృష్టి సారించే కథనాలను పక్కన పెడుతూ, ఋతుస్రావానికి సంబంధించిన స్థానిక పద్ధతులు మరియు ఆచారాలను ఆమె అన్వేషించారు.

‘ఋతు విద్య’ అన్న వారి పుస్తకం ద్వారా స్థానిక అభ్యాసాల వెనుక ఉన్న శాస్త్ర విజ్ఞానాన్ని వెలికితీసి, ఋతుక్రమం యొక్క భారతీయ దృక్పథం అనే ప్రత్యేకమైన కథనాన్ని ఆవిష్కరించారు. ఆమె అనేక హిందూ దేవాలయాలు, ఋతుక్రమ నిబంధనలు మరియు స్త్రీల ఋతుక్రమ ఆరోగ్యంపై వాటి ప్రభావాన్ని అధ్యయనం చేసారు. శబరిమల మరియు సంబంధిత శాస్తా దేవాలయాలు, మరీ ముఖ్యంగా, ఆ ప్రదేశాలు స్త్రీల ఋతుచక్రాలను మార్చే విధానం అనే అంశం పై ప్రత్యేక దృష్టితో, ఆమె అధ్యయనం చేసారు.

శబరిమలలో మహిళల ప్రవేశాన్ని నిరోధించే సంప్రదాయం వెనుక ఉన్న కారణాన్ని వెలికితీసే ప్రయత్నం మొదలు పెట్టిన సమయంలో, అటువంటి మోక్ష ధామం మహిళల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందనే విషయాన్ని, అప్పటి తంత్రి అభిప్రాయం…. తరువాత లోతుగా పరీశీలన చేస్తున్నపుడు, ‘షట్-చక్ర దేవాలయాలు అని పిలువబడే ఆరు ఆలయాలలో శబరిమల అంతర్భాగము’ అని శ్రీ అరవింద్ సుబ్రమణ్యం గారి పరిశోధనలో కనుగొన్న అంశాన్ని తెలుసుకున్నందు వల్ల, నా సిద్ధాంతం మరింత బలపడింది. ఈ పుస్తకంలో ప్రస్తావించినది కేవలం సిద్ధాంతం మాత్రమే కాదు, శబరిమలకు సంబంధించిన దేవాలయాల సందర్శన వల్ల పొందిన ప్రత్యక్ష అనుభవం, తద్వారా విశదమైన విషయాల వల్ల కలిగిన అవగాహన.

ఈ పుస్తకం ఆంగ్ల ముద్రణ మొదటిసారి నవంబర్ 2019 లో ప్రచురించబడింది. అప్పటి నుండి, శబరిమల సంప్రదాయంతో అనుబంధం ఉన్న అనేక మంది పండితులకు స్త్రీలకు, నా పుస్తకాన్ని సమర్పించి, వారితో చర్చించే అవకాశం నాకు లభించింది. అప్పటి తంత్రి మోహనరు కందరరు తో అనేక తరాల నుండి శబరిమల స్వామి అయ్యప్పతో సన్నిహిత సంబంధం ఉన్నవారి ప్రకారము, శబరిమల సంప్రదాయాల వెనుక ఉన్న నిజాల సమీక్ష ఇది. ఈ పుస్తకం తెలుగు భాషలో వెలువడడం చాల సంతోషకరమైన విషయం…. హేమలత గూడా

Related posts

మద్యం వ్యాపారంతో పెద్ద ఎత్తున పోగవుతున్న నల్లధనం

Satyam NEWS

విజయనగరం లో అశోక్ బంగ్లా వద్ద విజయోత్సవ వేడుకలు

Satyam NEWS

ఆదర్శ జీవితం: మొక్క‌లంటే ఆయ‌నకు ప్రాణం…

Satyam NEWS

Leave a Comment