27.7 C
Hyderabad
May 4, 2024 07: 29 AM
Slider ఖమ్మం

విత్తనాలు సకాలంలో అందించే బాధ్యత అధికారులదే

#Koteswara Rao

వ్యవసాయ కాలాన్ని అనుసరించి, వ్యవసాయ పనులను చేపట్టాలని రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ ఛైర్మన్ కొండబాల కోటేశ్వరరావు అన్నారు. ఐడిఓసి లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తో కలిసి, వ్యవసాయ అధికారులు, విత్తన డీలర్లతో విత్తన పంపిణీపై చైర్మన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్షేత్ర స్థాయిలో కావాల్సిన విత్తనాలు నాణ్యమైనవి, సకాలంలో అందించే బాధ్యత అధికారులపై ఉందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వానికి వ్యవసాయం పై ప్రత్యేక శ్రద్ధ వున్నదని ఆయన తెలిపారు. పచ్చి ఎరువు విత్తనాలు ఇండెంట్ ప్రకారం జిల్లాకు చేరుతాయన్నారు. అధిక దిగుబడి రావాలంటే ఏ రకమైన విత్తనాలు వాడాలో రైతులకు అవగాహన కల్పించాలన్నారు. పచ్చి ఎరువు విత్తనాల విషయంలో ఖమ్మం జిల్లా ప్రతి సంవత్సరం మొదటి స్థానంలో ఉన్నట్లు, ఈ సంవత్సరం మొదటి స్థానంలో వుండేలా చర్యలు తీసుకోవాలన్నారు. రైతులను చైతన్య పరచి సొసైటీలు,

పిఏసిఎస్ లు అమ్మకం ప్రారంభించాలన్నారు. డిమాండ్ ఉన్న రకాలకు కొరత లేకుండా చూడాలన్నారు. ప్రతి రకం పరీక్షల అనంతరం తెప్పించాలన్నారు. లాభసాటిగా ఉన్న రకాలపై రైతులతో చర్చించి, మంచి రకాలు పండించి, ఎక్కువ ఆదాయం పొందేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ,

ఆలస్యంగా విత్తడం వల్ల, ఆలస్యంగా పంట చేతికి వస్తుందని, దీంతో అకాల వర్షాలు, ప్రకృతి వైపరీత్యాలతో నష్టం సంభవించి, రైతులు నష్టపోతారని అన్నారు. మార్చి నెలాఖరు నాటికి పంట మొదలుపెట్టాలన్నారు. యాసంగి, వానాకాలం సీజన్లను అడ్వాన్స్ చేసుకోవాలన్నారు. ఎన్ఎస్ పి కాల్వ నీటిని బట్టి విత్తడం చేయడం ద్వారా చివరి ఆయకట్టు రైతులు ఆలస్యంగా విత్తడం చేస్తున్నారన్నారు.

సాగునీటి గురించి వేచియుండక, విత్తనాలు నాటాలన్నారు. వ్యవసాయ అధికారులు ఈ దిశగా చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. విత్తన అమ్మకాలు ముందస్తుగా ప్రారంభించాలన్నారు. అనుకరణ, పరీక్షలు పాస్ కానీ విత్తనాలు, షాపులు లేకుండా అమ్మే, లేబుళ్లు వేసి అమ్మే విత్తనాలపై నిఘా పెట్టాలని, కేసులు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. గతంలో వచ్చిన ఫిర్యాదులపై దృష్టి పెట్టాలని, చిల్లి నర్సరీలపై గట్టి నిఘా ఉంచాలని కలెక్టర్ అన్నారు.

Related posts

8వ విడత హరితహారానికి అధికారులు సన్నద్ధం కావాలి

Satyam NEWS

ప్రధాని నరేంద్ర మోడీ కి మెహం చాటేసిన సీఎం కేసీఆర్

Satyam NEWS

అభివృద్ధి కోసం నిరంతరం పని చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని ఆదరించండి

Satyam NEWS

Leave a Comment