39.2 C
Hyderabad
May 4, 2024 22: 38 PM
Slider సంపాదకీయం

ప్రధాని నరేంద్ర మోడీ కి మెహం చాటేసిన సీఎం కేసీఆర్

#cm kcr with mask

ప్రధాని నరేంద్ర మోడీ పైనా, కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ పైనా, ఆమె ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్ పైనా, భారతీయ జనతా పార్టీపైనా అత్యంత దారుణమైన విమర్శలు చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు మొహం చాటేశారు.

ప్రధాని నరేంద్రమోడీ హైదరాబాద్ పర్యటనలో ఎక్కడా సీఎం కేసీఆర్ పాల్గొనలేదు. ఇక్రిశాట్ లో జరిగిన కార్యక్రమానికి గానీ, ముచ్చింతల్ లో ఏర్పాటు చేసిన సమతా మూర్తి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో కానీ సీఎం కేసీఆర్ పాల్గొనలేదు. ప్రధాని మోడీని అత్యంత నీచమైన భాషలో విమర్శించిన సీఎం కేసీఆర్ ఆయన పర్యటనలో పాల్గొనగలరా? అని పలువురికి ముందునుంచే అనుమానం ఉంది.

ఆ అనుమానాలను నిజం చేస్తూ కేసీఆర్ మొహం చాటేశారు. అనారోగ్య కారణాలతోనే సీఎం పాల్గొనలేదని చెబుతున్నా కూడా నిన్న రాత్రి కూడా బాగానే ఉన్న సీఎం కేసీఆర్ కు ఆరోగ్య సమస్యలు ఏముంటాయని కొందరు ప్రశ్నిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీని తీవ్ర పదజాలంతో విమర్శించిన కేసీఆర్ మరొక అడుగు మందుకు వేసి అసలు దేశ రాజ్యాంగాన్నే మార్చాలని ప్రతిపాదించారు.

దాంతో తెలంగాణ లోని మేధావులే కాకుండా దేశవ్యాప్తంగా పలువురు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. రాజ్యాంగాన్ని రద్దు చేసి కొత్త రాజ్యాంగ రాయాల్సిన అవసరం ఏముందని ఎంతో మంది ప్రశ్నించారు. అంతే కాకుండా డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ కన్నా మెరుగుగా సీఎం కేసీఆర్ ఆలోచిస్తారా? అంటూ దళిత సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో అయితే సీఎం కేసీఆర్ మాటలతో దళిత ఆదివాసీ సంఘాలు భగ్గుమన్నాయి.

గ్రామ గ్రామానా సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా దళితులు ఉద్యమం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినందున ఆయనపై చర్యలు తీసుకోవాలని బిజెపి నాయకులు డిమాండ్ చేస్తున్నారు. బిజెపి నాయకులను పిచ్చి కుక్కలుగా అభివర్ణించిన సీఎం కేసీఆర్ పూర్తి వ్యతిరేకతను ఎదుర్కొంటున్న నేపథ్యంలో టీఆర్ఎస్ శ్రేణులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఆందోళనలు చల్లారడంలేదు.

ఈ దశలో హైదరాబాద్ వచ్చిన ప్రధాని నరేంద్రమోడీ పర్యటనకు సీఎం కేసీఆర్ గైర్ హాజర్ అయ్యారు. ప్రధానిని విమానాశ్రయంలో ఆహ్వానించేందుకు మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ప్రధాని పర్యటన మొత్తం రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ ఆయన పక్కనే ఉన్నారు. కేంద్ర మంత్రి జీ.కిషన్ రెడ్డి కూడా ప్రధానితోనే ఉన్నారు. ఏ కారణం చెప్పినా కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని పర్యటనలో పాల్గొనకపోవడం పై విమర్శలు గుప్పుమంటున్నాయి.

Related posts

నిత్యావసరాలు పంచుతున్న కూకట్ పల్లి ఆర్టీసీ TMU కార్మికులు

Satyam NEWS

పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో అక్రమంగా మట్టి తవ్వకాలు

Satyam NEWS

వైజాగ్ శిల్పారామంలో జాతీయ స్థాయి క్రాఫ్ట్ బజార్

Satyam NEWS

Leave a Comment