31.2 C
Hyderabad
May 3, 2024 01: 53 AM
Slider ఖమ్మం

గ్రీవెన్స్ డే దరఖాస్తులకు ప్రాధాన్యత

#Day applications

గ్రీవిన్స్ డే దరఖాస్తులకు ప్రాధాన్యత నిచ్చి, త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ వి.పి. గౌతమ్‌ అధికారులను ఆదేశించారు. ‘‘గ్రీవెన్స్‌ డే’’ ను పురస్కరించుకుని ఐడిఓసి లోని సమావేశ మందిరంలో కలెక్టర్ ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. స్వీకరించిన దరఖాస్తులను పరిష్కారానికి ఆదేశాలిస్తూ, ఆయా శాఖాధికారులకు కలెక్టర్ ఫార్వార్డ్ చేశారు.

ఈ సందర్భంగా కల్లూరు మండలం చెన్నూరు గ్రామం నుండి జక్కుల తిరుపతమ్మ, తాను బిఎస్సి నర్సింగ్ పూర్తి చేసినట్లు, ఎంఎల్ హెచ్ పి ఉద్యోగం కోసం దరఖాస్తు చేసినట్లు, తన దరఖాస్తును పరిశీలించి, ఉద్యోగం ఇప్పించగలందులకు కోరగా, జిల్లా కలెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్య అధికారిని పరిశీలించి, తగుచర్య తీసుకొనవాల్సినదిగా ఆదేశించారు. ఖమ్మం నుండి ఎస్కె. మాదార్ సాహెబ్, ఆర్టీసీ కాంప్లెక్స్ లో వాటర్ వాటిల్స్ అధిక ధరలకు అమ్ముతున్నట్లు ఫిర్యాదుచేయగా, ఆర్టీసీ డిఎం ను విచారించి చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.

మధిర మండలం మాటూరు గ్రామం నుండి గొల్లమందల ముత్తయ్య, ఎస్సి సొసైటీ భూమికి సంబంధించి, సర్వే నెంబర్ 955 లో 0.20 ఎకరాలను సాగుచేసుకుంటున్నట్లు, అట్టి దానిని సర్వే చేశారు కానీ ఆన్లైన్లో నమోదు చేసులేదని తగుచర్యకై కోరగా, మధిర తహసీల్దార్ కు విచారణకై కలెక్టర్ ఆదేశించారు.

ఖమ్మం రిక్కా బజార్ నుండి టి జ్యోతిలక్ష్మి, తాను ధాంసలాపురం సర్వే నెం. 12 నందు 104.22 చదరపు గజాలు భూమి కొన్నట్లు, అట్టి భూమిలో 54.22 చదరపు గజాల్లో రైల్వే బ్రిడ్జి వేసే క్రమంలో వాగును మళ్లించారని, కావున అట్టి భూమికి పరిహారం ఇప్పించుటకుగాని, వేరే చోట ప్లాట్ కేటాయించుటకు గాను కోరగా, ఆర్ అండ్ బి ఇంజనీరును పరిశీలించి, తగుచర్యకై కలెక్టర్ ఆదేశించారు. వైరా మండలం తాటిపూడి గ్రామం నుండి సిహెచ్. వెంకటేశ్వర్లు తాను 95 శాతం వికలాంగుడినని, ఆసరా పెన్షన్ మంజూరుకు కోరగా, డిఆర్డీవో ను తగుచర్యకై కలెక్టర్ ఆదేశించారు.

ఖమ్మం నుండి దుగ్గిరాల వెంకన్న, తనకు డబల్ బెడ్ రూం ఇల్లు మంజూరుకు కోరగా, తహసీల్దార్ ను పరిశీలనకై కలెక్టర్ ఆదేశించారు. పెనుబల్లి మండలం మండాలపాడు నుండి కోటగిరి శ్రీదేవి, సర్వే నెం. 2/ఇ లో తనకు చెందిన 15 కుంటల భూమిని ఇరుప్రక్కల వారు ఆక్రమించినట్లు, న్యాయం కొరకు కోరగా, ఏడి సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్ ను విచారణకు కలెక్టర్ ఆదేశించారు. సింగరేణి మండలం ఉసిరికాయలపల్లి నుండి బానోతు శంకర్, బానోతు అనిల్ లు సర్వే నెం. 548 లో ఉన్న

14.17 గుంటల భూమిని గిరిజనేతరులు ఆక్రమించినట్లు, ఎల్ టిఆర్ భూ బదలాయింపు నిషేధ చట్టం ప్రకారం కేసు నమోదుకు కోరగా, తహసీల్దార్ కు పరిశీలనకు కలెక్టర్ ఆదేశించారు. వేంసూరు మండలం రామన్నపాలెం గ్రామ ప్రజలు నల్లకుంట చెరువు శిఖం భూమిని కొందరు ఆక్రమించినట్లు, ఆక్రమనదారులపై చర్యలకు కోరగా, తహసీల్దార్ కు

విచారణకు ఆదేశించారు. ఖమ్మం రూరల్ మండలం పొలిశెట్టిగూడెం నుండి అప్పలరాజు, సర్వే నెం. 772 లో 2 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమంగా సాగుచేసుకుంటున్నారని, వారిపై చర్యలకు కోరగా, తహసీల్దార్ ను పరిశీలించి, తగుచర్యకై కలెక్టర్ ఆదేశించారు.

Related posts

అయోధ్య రామ్ లాలాకు 155 దేశాల నీటితో అభిషేకం

Satyam NEWS

ములుగులో డివైడర్ ను ఢీకొట్టిన లారీ

Satyam NEWS

డాడీ హెల్పింగ్ ఫౌండేషన్, ప్రభాస్ ఫ్యాన్స్ ఉదారత్వం

Satyam NEWS

Leave a Comment