37.7 C
Hyderabad
May 4, 2024 13: 42 PM
Slider కరీంనగర్

కన్నీళ్ల మధ్య అన్న మృతదేహానికి రాఖీ కట్టిన సోదరి

#rakhi

రాఖీ పండగ సందర్భంగా అన్నకు రాఖీ కట్టేందుకు వచ్చిన ఓ సోదరికి కన్నీరే మిగిలింది. పండగ పూట ఆ ఇంట్లో విషాదం అలముకుంది. గుండెపోటుతో తోడబుట్టినవాడు కుప్పకూలడంతో కన్నీటిపర్యంతమైంది. ఏడుస్తూనే అన్న మృతదేహానికి రాఖీ కట్టడం చూసి గ్రామస్థులు కూడా కంటతడి పెట్టారు.

పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ధూళికట్ట గ్రామంలో బుధవారం ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చూసిన వాళ్లను కన్నీరు పెట్టిస్తోంది.

ధూళికట్ట గ్రామానికి చెందిన చౌదరి కనకయ్య బుధవారం గుండెపోటుతో హఠాన్మరణం చెందాడు. రాఖీ పండగ సందర్భంగా కనకయ్య సోదరి గౌరమ్మ అన్న ఇంటికి వచ్చింది. సోదరుడికి రాఖీ కట్టి వెళదామని వచ్చిన గౌరమ్మ..

అన్న హఠాన్మరణంతో గుండెలవిసేలా రోదించింది. అప్పటిదాకా సంతోషంగా ఉన్న అన్న ఒక్కసారిగా విగతజీవిగా మారడం తట్టుకోలేకపోయింది. తీవ్ర దుఃఖంతోనే సోదరుడి మృతదేహానికి రాఖీ కట్టింది.

Related posts

జస్టిస్ వాంటెడ్: నేతన్నల హక్కుల కోసం కోర్టు మెట్లు ఎక్కుతా

Satyam NEWS

సైలెన్స్ స్ట్రైక్: ప్రియుడు ఇంటి ముందు ప్రియురాలి మౌన దీక్ష

Satyam NEWS

ప్రైవేటు ఉపాధ్యాయులను ప్రభుత్వం కనీస వేతనం ఆదుకోవాలి

Satyam NEWS

Leave a Comment