42.2 C
Hyderabad
April 30, 2024 18: 34 PM
Slider నల్గొండ

ప్రైవేటు ఉపాధ్యాయులను ప్రభుత్వం కనీస వేతనం ఆదుకోవాలి

#Private Teachers

TPTF మండల అధ్యక్షుడు యాడవెల్లి సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో TPTF సమావేశం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో జరిగింది. ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షుడు గొట్టె నాగరాజు యాదవ్ మాట్లాడుతూ  ప్రైవేట్ ఉపాధ్యాయులను, ప్రభుత్వం  ఆదుకోవాలని,కరోనా వైరస్ వ్యాప్తి నుండి ఇప్పటి వరకు నాలుగు నెలల నుంచి జీతాలు లేక ప్రైవేటు ఉపాధ్యాయులు ఉపాధ్యాయ వృత్తిని వదులుకునే పరిస్థితి ఏర్పడిందని అన్నారు.

వారు ఇప్పుడు రోజువారి కూలీలుగా మరియు ఉపాధిహామీ కూలీలుగా, పండ్ల వ్యాపారులుగా, వివిధ వృత్తుల్లో కొనసాగుతున్నారని అన్నారు. ప్రభుత్వం వెంటనే ప్రైవేట్ ఉపాధ్యాయులకు నిరుద్యోగ భృతి కింద కనీస వేతనం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి మామిడి కుమార్, మండల ఉపాధ్యక్షుడు జక్కుల మల్లికార్జున్, తదితరులు పాల్గొన్నారు.

Related posts

కవన మంజరి కవితా సంపుటి ఆవిష్కరణ

Satyam NEWS

నో బ్రేక్: తిట్టడం… తిట్టించుకోవడం ఇదే పని

Satyam NEWS

గ్లామర్ ప్రపంచానికి టోనీ అండ్ గై ఎస్సెన్షియల్స్

Satyam NEWS

Leave a Comment