36.2 C
Hyderabad
May 14, 2024 16: 44 PM
Slider ఖమ్మం

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రెగ్యులరైజ్ చేస్తాం

#Congress

రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని, రాగానే ఎటువంటి షరతులు లేకుండానే సెకండ్ ఏఎన్ఎంలను రెగ్యులరైజ్ చేస్తామని, పార్టీ పక్షాన ఇది తన హామీ అని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో ఛైర్మన్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు.

గత పదిహేను రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేస్తున్న సెకండ్ ఏఎన్ఎంలకు సంఘీభావం తెలుపుతూ ఖమ్మం సమీకృత కలెక్టరేట్ ఎదుట ధర్నాచౌక్ లో నిర్వహిస్తున్న కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ గత 15,16 ఏళ్లుగా కాంట్రాక్టు పద్దతిలో పనిచేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన 4500 మందిని రెగ్యులరైజ్ చేయాలని కోరితే అందుకు రాష్ట్ర ప్రభుత్వం పరీక్షలు పెడతామని, ఇంటర్వ్యూలకు హాజరుకావాలని ఇలాంటి షరతులు విధిస్తుందని ఇది సమంజసం కాదని మండిపడ్డారు.

ఏళ్లుగా పనిచేస్తున్న వారికి ఖచ్చితమైన అవగాహన ఉంటుందని బేషరత్తుగా వారిని రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేయకపోయినా ఖచ్చితంగా కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వారి డిమాండ్లను బేషరత్తుగా పరిష్కారిస్తామని హామీ ఇచ్చారు.

అనంతరం ఏఎన్ఎం సోదరీమణులు పొంగులేటికి రాఖీ కట్టి రక్షాబంధన్ భాకాంక్షలు తెలిపారు. సంఘీభావం తెలిపిన వారిలో పొంగులేటితో పాటు కాంగ్రెస్ రాష్ట్ర నాయకురాలు మద్దినేని బేబి స్వర్ణకుమారి, డీసీసీబీ మాజీ చైర్మన్ మువ్వా విజయబాబు తదితరులు ఉన్నారు.

Related posts

ఏపిలో పెట్రోల్, డీజిల్ పై అదనపు పన్ను విధింపు

Satyam NEWS

హుమాయూన్ నగర్ లో కంటేన్ మెంట్ జోన్

Satyam NEWS

మార్చిలో పదో తరగతి పరీక్షలు: మంత్రి సురేశ్‌

Satyam NEWS

Leave a Comment