38.2 C
Hyderabad
May 5, 2024 22: 19 PM
Slider ముఖ్యంశాలు

విద్యార్థుల బట్టలు, సామాన్లు బయట పడేసిన సిబ్బంది

#the students

బాసర ట్రిపుల్ ఐటీ మరోసారి వార్తల్లోకెక్కింది. ఈసారి సిబ్బంది తప్పిదం కావడం గమనార్హం. సమ్మర్ హాలిడేస్ కావడంతో ఇంటికి వెళ్లిన విద్యార్థులు తిరిగి హాస్టల్‌కు రాగా.. వారి బట్టలు, సామాన్లు కనిపించలేదు. ఈ విషయం గురించి సిబ్బందిని

అడగగా వారు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. విద్యార్థులు లేని సమయంలో హాస్టల్స్ రూముల తాళాలు పగల గొట్టిన సిబ్బంది.. విద్యార్థుల బట్టలు, సామాన్లు బయట పడేశారు. ఈ నెల 7వ తేదీ నుండి విద్యార్థులకు సెమిస్టర్ పరీక్షలు

ఉండటంతో వారు తిరిగొచ్చారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు.. పడేసిన సామాన్లు కోసం వెతుక్కోవాలా? లేదా పరీక్షలు రాయాలా? అని

ప్రశ్నిస్తున్నారు. తమ పిల్లలకు ఏవైనా ఆటంకాలు కలిగితే.. అందుకు బాసర ట్రిపుల్ ఐటీ అధికారులు, సిబ్బందే బాధ్యత వహించాలని హెచ్చరించారు…

Related posts

అధికార పార్టీని ఇరకాటంలో పెడుతున్న రాజ్యసభ సభ్యుడు

Satyam NEWS

జర్నలిస్టు, పోలీసు, టీచర్స్ టోర్నీ ముగింపు

Satyam NEWS

29 నుండి జులై 7 వరకు తాళ్లపాకలో శ్రీ సిద్ధేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు

Bhavani

Leave a Comment