38.2 C
Hyderabad
May 2, 2024 21: 50 PM
Slider విజయనగరం

ఆసుపత్రి పారిశుద్ధ్య కార్మికులకి వేతనాలు పెంచాలి

ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులకు, సెక్యూరిటీ గార్డులకి పెంచిన వేతనాలు ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నందుకు నిరసనగా ఆంధ్రప్రదేశ్ వేతనాలు ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాంట్రాక్టు ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ ( ఏఐటీయూసీ అనుబంధం ) ఆధ్వర్యంలో దశాలవారీ పోరాటాలకి సిద్ధమయ్యామని ఎఐటియుసి విజయనగరం జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ తెలిపారు.

జిల్లాలో ప్రభుత్వ, ఘోషా మొదలైన పి.హెచ్.సి, సి.హెచ్.సి ఆసుపత్రిలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ పారిశుద్ధ్య, పెస్ట్ కంట్టోల్ వర్కర్స్, సెక్యురిటీ గార్డులకి పెంచిన వేతనాలు ఇప్పించి సామరస్య వాతావరణం నెలకొల్పాలని కోరుతూ బుధవారం ఉదయం ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ ( ఏఐటీయూసీ అనుబంధం ) ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా ఇన్ఛార్చ్ సూపరింటెండెంట్ గౌరీశంకర్ క్ వినతిపత్రం సమర్పించడం జరిగింది.

అనంతరం బుగత అశోక్ మాట్లాడుతూ జిల్లా ప్రభుత్వ, ఘోషా, పి.హెచ్.సి, సి.హెచ్.సి ఆసుపత్రలల్లో పనిచేశ్తున్న ట్రాక్ట్ పారిశుద్ధ్య, పెస్ట్ కంట్రోల్ వర్కర్లకు ప్రభుత్వం జారీ చేసిన 549 జీవో ప్రకారం కాంట్రాక్ట్ వర్కర్స్ అందరికీ 16వేలు జీతాలు ప్రకటించి ప్రభుత్వం ఒక ప్రైవేటు కాంట్రాక్టరు చేతిలో పెట్టడం దారుణమన్నారు. కాంట్రాక్టరు చేతిలోకి వెళ్లిన తర్వాత ప్రతి నెలా సక్రమంగా జీతాలు చెల్లించకపోవడం వలన నేడు ప్రభుత్వాలు పెంచుతున్న ధరల భారలను తట్టుకోలేక తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కాంట్రాక్టరు మారిన తర్వాత 15 మాసాలు నుంచి పి ఎఫ్ ఎంత జమ అవుతుందో, ఈఎస్ఐ ఎంత కటింగ్ చేస్తున్నారో ఇంతవరకు ఫే స్లిప్పులు ధ్వారా తెలియజేయకుండా కాలయాపన చేస్తున్నారన్నారు. ఆసుపత్రిలో సరిపడా వర్కర్స్ నియమించకుండా కాంట్రాక్టరు వర్కర్స్ తో వెట్టిచాకిరి చేయించుకుంటూ వారికి జీతాలు మాత్రం సరిగ్గా ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ వర్కర్స్ అందరిని అప్కాశ్ లో చేర్చాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో 549 ప్రకారం జీతాలు వ్వకుండా కాంట్రాక్టరు కార్మికులందర్నీ మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కరోనా సీజన్లో కూడా ఇల్లు, పిల్లల్ని వదిలి ప్రాణాలు పణంగా పెట్టి, కరోనా రోగులకు సేవ చేసి వర్కర్స్ అందరూ కరోనా బారిన పడిన వారిని కనీసం ఎవ్వరూ

పట్టించుకోకపోగా ప్రభుత్వం మాత్రం వీరి పట్ల నిర్లక్ష్యం చూపుతుందన్నారు. ప్రభుత్వం వెంటనే కలుగజేసుకొని ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ వర్కర్స్ అందరిని అప్కాశ్ లో చేర్చి ప్రతి నెలా జీతం చెల్లించాలని డిమాండ్ చేశారు. వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామని లేనిపక్షంలో రానున్న రోజుల్లో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఉద్యమం తీవ్రతరంగా మారుతుందని హెచ్చరించారు. వర్కర్స్ తో కాయాకల్పలాంటి పనులు చేయించుకుని అవార్డులు అధికారులకి, కష్టించి పని చేస్తున్న వర్కర్స్ కి వేధింపులు, ఆకలి మిగులుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో ఏఐటీయూసి జిల్లా అధ్యక్షుడు ఎస్.రంగరాజు, జిల్లా కార్యదర్శి పురం అప్పారావు మరియు వర్కర్స్ పాల్గొన్నారు.

Related posts

శ్రీకాకుళం నేడు జాతీయ క్రీడా దినోత్సవం

Satyam NEWS

బాల్య వివాహాలు చేస్తే కఠిన చర్యలు తప్పవు

Satyam NEWS

కృష్ణా జిల్లా పూర్వ కలెక్టర్ పై నాన్ బెయిలబుల్ వారెంట్

Satyam NEWS

Leave a Comment