33.7 C
Hyderabad
April 29, 2024 00: 42 AM
Slider క్రీడలు

T20 World Cup: పైనల్ చేరిన పాకిస్తాన్

#pakistan

టీ20 ప్రపంచకప్ తొలి సెమీఫైనల్‌లో న్యూజిలాండ్‌పై పాకిస్థాన్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది. 13 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ జట్టు ఫైనల్‌కు చేరుకుంది. ఈ మ్యాచ్‌లో, న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసి నాలుగు వికెట్లకు 152 పరుగులు చేశాడు. అనంతరం పాక్‌ 5 బంతుల్లో మూడు వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది.

ఇప్పుడు ఫైనల్లో భారత్-ఇంగ్లండ్ మ్యాచ్ విజేతతో పాకిస్థాన్ తలపడనుంది. తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఏడు వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నాలుగు వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. న్యూజిలాండ్ తరఫున డారెల్ మిచెల్ 53, కేన్ విలియమ్సన్ 46 పరుగులు చేశారు. పాకిస్థాన్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది రెండు వికెట్లు పడగొట్టాడు.153 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్‌కు బాబర్‌, రిజ్వాన్‌ జోడీ శుభారంభం అందించింది.

వీరిద్దరూ తొలి వికెట్‌కు 105 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి పాక్ విజయాన్ని ఖరారు చేశారు. బాబర్ 53, రిజ్వాన్ 57 పరుగులు చేశారు. చివర్లో హరీస్ రవూఫ్ 30 పరుగుల ఇన్నింగ్స్ ఆడి పాకిస్థాన్‌ను విజయతీరాలకు చేర్చాడు. న్యూజిలాండ్‌లో ట్రెంట్ బౌల్ట్ రెండు వికెట్లు తీశాడు. 2009 తర్వాత తొలిసారి టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ జట్టు ఫైనల్‌కు చేరుకుంది. ఇప్పుడు ఫైనల్ మ్యాచ్‌లో భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ విజేతతో పాకిస్థాన్ తలపడనుంది.

Related posts

గందరగోళం సృష్టించిన 22 A: అధికారులపై చర్య తీసుకోండి

Satyam NEWS

తహసిల్దార్ ఆఫీసు భద్రతకు కొల్లాపూర్ పోలీసుల చర్యలు

Satyam NEWS

అమరావతిపై నిపుణుల కమిటీ ఏర్పాటు

Satyam NEWS

Leave a Comment