28.7 C
Hyderabad
May 15, 2024 02: 54 AM
Slider ప్రపంచం

పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై దొంగతనం కేసు

#imrankhan

పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై దొంగతనం కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఆయనపై పాకిస్థాన్ అత్యున్నత దర్యాప్తు సంస్థ విచారణ ప్రారంభించినట్లు మీడియా కథనం. ఆయన ప్రధానిగా ఉన్న సమయంలో ఒక ఖరీదైన నక్లెస్ ను ఒకరు బహూకరించారు.

నిబంధనల ప్రకారం ప్రధానిగా వచ్చిన బహుమతులను ప్రభుత్వ గిఫ్ట్ రిపోజిటరీలో డిపాజిట్ చేయాలి. అయితే ఆయన అలా చేయకుండా ఆ నక్లెస్ ను 18 కోట్ల రూపాయలకు అమ్ముకున్నారనేది అభియోగం. ఇమ్రాన్ ఖాన్ తనకు వచ్చిన బహుమతిని తోషా-ఖానా (స్టేట్ గిఫ్ట్ రిపోజిటరీ)కి పంపకుండా ఆయన తన మాజీ స్పెషల్ అసిస్టెంట్ జుల్ఫికర్ బుఖారీకి ఇచ్చారు.

బుఖారీ ఆ నగను లాహోర్‌లోని నగల వ్యాపారికి 18 కోట్ల రూపాయలకు విక్రయించాడని పాకిస్తాన్ మీడియా వెల్లడించింది. దీనిపై ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎఫ్‌ఐఏ) విచారణ ప్రారంభించిందని కూడా మీడియా తెలిపింది.

Related posts

లేబర్ కోడ్ లు రద్దు చేయకపోతే మరో చికాగో పోరాటం తప్పదు

Bhavani

ఆధునిక ఆయుధాల కొనుగోలుకు సాయుధ దళాలకు అనుమతి

Satyam NEWS

కామారెడ్డిలో రేవంత్ రెడ్డి గెలుపు పక్కా

Satyam NEWS

Leave a Comment