38.2 C
Hyderabad
May 3, 2024 19: 51 PM
Slider తెలంగాణ

తెలంగాణలో క‌రోనా 596 కేసులు, 3 మరణాలు

covid

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 59,471 పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 596 పాజిటివ్‌ కేసులు వెలుగు చూశాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదైన మొత్తం కేసులు 2,72,719కి చేరింది. మరోవైపు కరోనాతో చికిత్స పొందుతూ ముగ్గురు మృతి చెందగా.. మొత్తం ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1,470కి చేరింది.

తాజాగా కరోనా నుంచి మరో 972 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకూ కోలుకున్నవారి సంఖ్య 2,62,751కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 8,498 క్రియాశీల కేసులు ఉన్నాయి. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో 6,465 మంది ఉన్నారు. తాజాగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 102 కేసులు నమోదయ్యాయి.

Related posts

ఈవీఎం లపై ఓటర్లకు అవగాహన

Bhavani

అమరావతిపై కేంద్రం అఫిడవిట్ తో ఆందోళన వద్దు

Satyam NEWS

రోడ్డు ప్రమాదం లో ఇద్దరు మృతి

Bhavani

Leave a Comment