30.7 C
Hyderabad
May 5, 2024 05: 53 AM
Slider కడప

రాజ్యాంగ హక్కుల కాలరాస్తే పుట్టగతులు ఉండవు

#constitutional rights

జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం స్వేచ్ఛ హక్కులకు ,పౌర హక్కులకు భంగం కలిగించే విధంగా రాజ్యాంగ హక్కులు కాల రాస్తే పుట్టగతులు ఉండవని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రపంచ నియంత హిట్లర్ లా వ్యవహరిస్తే ప్రజలు స్టాలిన్ లు అయ్యి తిరగబడతారని రాబోయే ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ప్రజలు ఓడిస్తారన్నారు అఖిలపక్ష నాయకులు స్పష్టం చేశారు.

శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ప్రభుత్వ ఉత్తర్వులు జీవో 1 ని వెనక్కి తీసుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం కడప ప్రెస్ క్లబ్ లో నిర్వహించారు ఈ సమావేశంలో తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి హరి ప్రసాద్ , అమీర్ బాబు లక్ష్మి రెడ్డి , కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు సత్తార్ సిపి యం జిల్లా కార్యదర్శి జి చంద్రశేఖర్ , బీఎస్పీ నాయకులు గుర్రప్ప , లోక్సత్తా లోక్ సత్తా నాయకులూ కృష్ణా , జనతాదళ్ ( యు )నాయకులు ప్రతాపరెడ్డి , సిపిఐ ఎంఎల్లిబరేషన్ జిల్లా కార్యదర్శి జి రమణ , ఆర్ సి పి నాయకులు మక్బుల్ భాష ,

ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎమ్ వి సుబ్బారెడ్డి వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా కన్వీనర్ చిన్న సుబ్బయ్య , ఎస్సీ ఎస్టీ మానవ హక్కుల నాయకులు జెవి రమణ , ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ శివన్న ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్ నాగ సుబ్బారెడ్డి , సిపిఐ జిల్లా కార్యవర్గసభ్యులు కే ఆంజనేయులు ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ద్రావిడ సురేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి జి వలరాజు ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి సురేష్, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి కే మునయ్య , సిఆర్వి ప్రసాద్ ,

రిటైర్డ్ డిఎస్పి ఫణి రాజు పాల్గొని మాట్లాడుతు జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేందుకు పాదయాత్రలు ఓదార్పు యాత్రలు రోడ్ షో లు, రోడ్లపై సభలు సమావేశాలు దీక్షలు చేయచ్చు కానీ జగన్ అధికారంలో ఉంటే ప్రతిపక్షాలు ప్రజలు చేయకూడదా? రాజ్యాంగం నీ ఒక్కనికే హక్కులు కల్పించలేదని అందరికీ సమాన హక్కులు కల్పించిందన్న విషయం జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలన్నారు.

రాష్ట్ర ప్రజలు 151 స్థానాలు కట్టబెడితే సివిల్ సర్వీస్ ఐఏఎస్ అధికారుల సేవలు సలహాలు ఉపయోగించి పరిపాలన చేయకుండా వందల మందిని సలహాదారులుగా నియమించుకుని పరిపాలనను నాశనం చేశారన్నారు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం తో ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని అనునిత్యం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందన్నారు వైఎస్సార్ జల కళ పథకం కింద ఉచిత బోర్లు వేయిస్తా అని చెప్పి చేయక పోగా వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టటం , నిత్యవసర ఇతర వస్తువులు ధరలు పెంచడం, చెత్త పన్ను విధించడం , పించన్ లు తొలగించడం, రైతులకు గిట్టబాటు ధర కల్పించకపోవడం , విద్యా వ్యవస్థను బ్రష్టు పట్టించడం ,

నిరుద్యోగులను ఉద్యోగాలూ ఇవ్వకపోవడం , కడప ఉక్కు పరిశ్రమ నిర్మిచక పోవడం , ఇలా వైయస్ జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలు అనేకం వాటిని ప్రతిపక్షాలు ప్రజాసంఘాలు ప్రజలు వ్యతిరేకించకుండా ఉండేందుకు రాష్ట్రంలో ప్రదర్శనలు, సభలు సమావేశాలు, నిరసనలు నిషేధిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు (జీవో) 1 తీసుకొచ్చిందని ఈ జీవో రాజ్యాంగ విరుద్ధమని వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు. బ్రిటిష్ కాలం నాటి పోలీసు చట్టం 1861 అనుసరించి పోలీసు చట్టం 30 30ఏ ప్రకారం ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం సిగ్గుచేటు అన్నారు ఇండియాకు స్వాతంత్రం వచ్చి ఒక రాజ్యాంగాన్ని తయారు చేసుకొని అందులో పౌర హక్కులు కల్పించుకుందన్నారు ఇంకా బ్రిటిష్ కాలం నాటి పోలీసు చట్టాలను

ఉపయోగించటం నియంతృత్వమే అన్నారు
రాజ్యాంగంలో అధికరణ 19 (1) వాక్ స్వాతంత్రం భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని ప్రజలు తమ అభిప్రాయాలను భావాలను వెల్లడించుకోవచ్చన్నారు అధికరణ 19 (2) ప్రకారం శాంతియుతంగా సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం , ప్రదర్శనలు ఊరేగింపులు నిరసనలు తెలిపే హక్కు కల్పించిందన్నారు అధికరణ 19(3) సంఘాలు, రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసుకోవడం సంఘంలో సభ్యులుగా పాల్గొనటం వంటి హక్కులు పౌరులకు రాజ్యాంగం కల్పించిందన్నారు
అయితే రాజ్యాంగం హక్కులు కాలరాస్తూ జగన్మోహన్ రెడ్డి నియంతృత్వ పోకడలతో సభలు ఊరేగింపు లు ,ప్రదర్శనలు ,

నిషేదం చేయటం సమంజసం కాదన్నారు తక్షణమే జీవో నెంబర్ ఒకటిని వెనక్కి తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఇంటింటికి జగన్మోహన్ రెడ్డి నేతృత్వ విధానాలను ఇంటింటికీ తీసుకెళ్తామన్నారు జీవో నెంబర్ ఒకటి రద్దు కోరుతూ శనివారం ఉదయం కడప నగరంలోని అంబేద్కర్ కూడలి లో నిరసన చేపడుతున్నట్లు తెలిపారు ఈ సమావేశంలో ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షులు పి చంద్రశేఖర్, ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు

జి.వేణుగోపాల్ , ఉప ప్రధాన కార్యదర్శి కే.సి.బాదుల్ల, మహిళా సమాఖ్య నాయకురాళ్ళు బషి రున్నిషా,విజయలక్ష్మి, సుజాత, సావంత్ సుధాకర్, డిహెచ్ పిఎస్ నాయకులు ఓబయ్య, పుష్పరాజ్, అర్ బాబు, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు బి దస్తగిరి, నాగరాజు చేతివృత్తిదారుల సంఘం ఉపాధ్యక్షులు వి భాగ్యలక్ష్మి , భీమరాజు, ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య జిల్లా అధ్యక్షుడు బ్రహ్మం , రైతుసంఘం బాల చంద్రయ్య, మనోహర్ రెడ్డి, జయన్న,రమోహన్ రెడ్డి, కొండయ్య, పక్కీరప్ప , తదితరులు పాల్గొన్నారు

Related posts

భారత స్పేస్ పరిశోధనల్లో ప్రైవేటు భాగస్వామ్యం

Sub Editor

పేపర్ లీకేజ్ పై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి

Satyam NEWS

హైదరాబాద్ శివార్లలో అంతర్జాతీయ స్థాయి సినీ సిటీ

Satyam NEWS

Leave a Comment