34.2 C
Hyderabad
May 14, 2024 19: 10 PM
Slider ముఖ్యంశాలు

వైసీపీకో రూలు, మాకో రూలా ? జనం తిరగబడే పరిస్ధితి తెచ్చుకోవద్దు

#Chandra babu

కుప్పంలో టీడీపీ కార్యాలయానికి వెళ్లకుండా చంద్రబాబును పోలీసులు అడ్డగించారు. దీంతో ఆయన పోలీసుల తీరును నిరసిస్తూ రోడ్డుపైనే కూర్చున్నారు. అనంతరం తన బస్సుపైకి ఎక్కి కార్యకర్తల్ని ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలో పోలీసులు అరాచకం వెనుక సైకో సీఎం జగన్ రెడ్డి ఉన్నాడని చంద్రబాబు విమర్శించారు. పోలీసులూ.. మీకు అసలు మానవత్వం ఉందా? అని ప్రశ్నించారు. నన్ను నా నియోజకవర్గంలో అడ్డుకోవడానికి మీకు సిగ్గనిపించలేదా పోలీసులంటూ చంద్రబాబు నిప్పులు చెరిగారు.

నా నియోజకవర్గ ప్రజలను నేను కలిసేందుకు హక్కు లేదా?, మీ ఇష్ట ప్రకారం మమ్మల్ని వేధించడానికి ప్రయత్నిస్తారా? అని పోలీసుల్ని చంద్రబాబు ప్రశ్నించారు. నేను తిరిగితే ప్రజల్లో మీపై తిరుగుబాటు వస్తుందన్నారు. మీరు ఎంత ఆపితే ప్రజలు అంతగా తిరగబడతారని, మీరు శారీరకంగా మాత్రమే ఇబ్బంది పెట్టగలుగుతారని, ప్రజల కోసం ప్రాణాలైనా ఇచ్చే సంకల్పం నాది అన్నారు. తనను ఆపేందుకు వేలమంది పోలీసులు వచ్చారని, మేమేమైనా టెర్రరిస్టులమా? అని ప్రశ్నించారు.

నన్ను పంపేయాలని చూస్తే మిమ్మల్నే పంపిస్తా అంటూ పోలీసులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టానుసారం ప్రవర్తిస్తే ఊరుకునేది లేదన్నారు. ప్రజలు తిరగబడే పరిస్థితి తెచ్చుకోవద్దన్నారు. వైసీపీ నేతలు రోడ్డు షోలు, సభలు పెట్టుకోవచ్చా.? వైసీపీ వాళ్లకు ఒక రూలు.. మాకో రూలా? అని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రజాహితం కోసమే తన పోరాటమన్నారు. బానిసలుగా మారిన పోలీసులను చూస్తే జాలేస్తోందన్నారు. తనది ఉక్కు సంకల్పమన్నారు. తప్పుడు కేసులతో ఎవరినీ బెదిరించలేరన్నారు.

సీఎం జగన్ కు భయం పట్టుకుందని, హద్దులు దాటినవాళ్లకు తగిన బుద్ధి చెబుతామని చంద్రబాబు హెచ్చరించారు. ప్రజాస్వామ్యంపై దాడిచేస్తే.. భూస్థాపితం చేస్తామన్నారు. నా నియోజకవర్గ ప్రజలను నేను కలవకూడదా? అని చంద్రబాబు ప్రశ్నించారు. పోలీసులూ.. మావాళ్లపై దాడి చేసి మావాళ్లపైనే హత్య కేసులు పెడతారా? అని నిలదీశారు.

శాంతిభద్రతలు కాపాడటమే పోలీసుల పని, ప్రజలను కొట్టడం కాదన్నారు. జాబు రావాలంటే బాబు రావాల్సిందేనని యువత కోరుకుంటున్నారన్నారు. బాబాయ్ ను గొడ్డలిపోటుతో లేపేసి గుండెపోటు అన్నారని, తాను వంట గ్యాస్ ఇస్తే, జగన్ రెడ్డి ఆ దీపాన్ని ఆర్పేశారన్నారు. పేదల రక్తాన్ని తాగే జలగ ఈ జగన్మోహన్ రెడ్డి అని చంద్రబాబు విమర్శించారు.

చిత్తూరులో గ్రానైట్ కంపెనీలకు రూ.150 కోట్ల ఫైన్ వేశారన్నారు. రూ.150 కోట్లు కడతారా.. లేక రూ.60 కోట్ల ఫండ్ ఇస్తారా అని బెదిరించారని, ఈ సీఎం పని అయిపోయిందని చంద్రబాబు అన్నారు. అందరి పేర్లూ గుర్తు పెట్టుకుంటానని, పోలీసులు ముఖం చాటేసే పరిస్థితికి వస్తున్నారన్నారు. తన ప్రచార రథానికి లైసెన్స్ ఉందని, ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఉండడానికి వీలు లేదంట. తప్పు చేసిన వాళ్లనందరినీ బట్టలు విప్పి నడిరోడ్డుపై తిప్పే రోజు వస్తుందన్నారు.

Related posts

కేసీఆర్ సేవలు దేశానికి అవసరం: మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్

Satyam NEWS

Corona: ఇంట్లో దాక్కొనే కాలం మళ్లీ దాపురిస్తుందా…?

Satyam NEWS

పస్రా లో ఘోర రోడ్డు ప్రమాదం: ఒకరి మృతి

Satyam NEWS

Leave a Comment