39.2 C
Hyderabad
May 3, 2024 12: 45 PM
Slider శ్రీకాకుళం

పేపర్ లీకేజ్ పై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి

పేపర్ లీకేజ్ వెనుక పెద్ద మాఫియా దాగివుందని, దానిని కూకటివేళ్ళతో పెకలించాలని రాష్ట్ర ప్రభుత్వం ను ఆప్ శ్రీకాకుళం జిల్లా ఇంచార్జ్ జైదేవ్ కోరారు. రాష్ట్రంలో రెండు దశాబ్దాలుగా కార్పొరేట్ విద్యాసంస్థలు పేపర్ లీకేజీ పాల్పడుతున్నాయనీ, వారి విద్యార్థులకు ర్యాంకులు రాబెట్టి, వాటిని చూపించి వేల కోట్ల రూపాయలను సామాన్య ప్రజల దగ్గరనుంచి చదువు పేరుతో దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు.

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో నిర్వీర్యం చేయడంలో కార్పొరేట్ విద్యాసంస్థలు పాత్ర ఉన్నదని, ప్రభుత్వ పాఠశాలలో సబ్జెక్టు ను బాగా చెప్పగల ఉపాధ్యాయులు డబ్బుల తో ఎర వేసి వారిని వక్రమార్గంలో పడేటట్లు చేశారని ఆరోపించారు. చాలా కార్పొరేట్ విద్యా సంస్థలు సిండికేట్ గా ఏర్పడి విద్యా వ్యవస్థను వ్యాపారంగా మార్చేశారు అన్నారు.

గత ప్రభుత్వంలో కూడా లీకేజ్ జరిగినప్పటికీ ప్రభుత్వం చూసీచూడనట్లు వ్యవహరించిందని తెలిపారు. విద్యా వ్యవస్థను వ్యాపారం చేసి అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించడం తో పాటు, విద్యార్థులపై ఒత్తిడిచేసేవారని, ఆ ఒత్తిడిని తట్టుకోలేక అనేక మంది విద్యార్థులు గతంలో ఆత్మహత్యలు చేసుకున్న విషయం గుర్తు చేశారు.

కార్పొరేట్ విద్య పేపరు లీకేజ్లు, పిల్లలు ఆత్మ హత్యలు పై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన పాలక ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమస్యను రాజకీయ కోణంలో కాకుండా, పూర్తి స్థాయిలో విచారణ చేసి తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని, అవకతవలు కు పాల్పడిన కార్పొరేట్ విద్యాసంస్థలను గుర్తింపు రద్దు చేయాలని ప్రభుత్వను కోరారు. ప్రభుత్వ పాఠశాలలను, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం తీర్చిదిద్దినట్లు మన రాష్ట్రంలో కూడా చక్కిటి ప్రణాళికలు చేసి, అమలు చేస్తే సత్ఫలితాలను రాబట్ట వచ్చు అని సూచించారు.

Related posts

ప్రశాంతంగా గణేష్ ఉత్సవాలు

Bhavani

అఖిల భారత అందాల శ్రీమతి పోటీలలో రన్నర్ గా ప్రియాంక భరత్

Satyam NEWS

మౌనం వీడి నిర్భయంగా షీ టీమ్స్ కు ఫిర్యాదు చేయండి

Satyam NEWS

Leave a Comment