26.7 C
Hyderabad
May 3, 2024 07: 21 AM
Slider ఖమ్మం

ఓటర్ జాబితాలో తప్పులు లేవు

#Primary Schools

జిల్లాలో ఓటర్ జాబితాలో ఎలాంటి తప్పిదాలు లేని, సరైన తుది ఓటరు జాబితాను సిద్దం చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. కలెక్టర్ స్థానిక జిల్లా అటవీ అధికారి, నయాబజార్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ఖమ్మం రూరల్ మండలం పెద్దతండా గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఓటరు నమోదు కేంద్రాలను జిల్లా కలెక్టర్ తనిఖీలు చేశారు.

జిల్లా అటవీశాఖ అధికారి కార్యాలయంలో ఏర్పాటుచేసిన కేంద్రంలో తన ఓటు ఉన్నది లేనిది అడిగి తెలుసుకున్నారు. ఎన్ని ఫారాలు స్వీకరించింది, ఓటుకు ఫోన్ నెంబర్ ట్యాగ్ చేసింది, పోలింగ్ కేంద్ర పరిధిలో ఎంతమంది ఓటర్లు ఉన్నది, ఎంత మంది 18-19 వయస్సు గల ఓటర్లు ఉన్నది, ఓటరు నిష్పత్తిలో ఎంత మంది ఉండాల్సింది అడిగి తెలుసుకున్నారు. సె

క్టార్ అధికారులు తమ తమ పరిధిలోని పోలింగ్ కేంద్రాల సందర్శన చేయాలని ఆయన తెలిపారు. ప్రతిరోజు ఇంటింటి నుండి చెత్తను సేకరించే సానిటేషన్ వాహనాల ద్వారా స్పేషల్ క్యాంపేయిన్ డే ను గురించి ప్రజలకు తెలియజేసేలా వాయిస్ సందేశాన్ని ప్రచారం చేయాలన్నారు.

స్పెషల్ క్యాంపేయిన్ డే లు నిర్వహించే చోట బ్యానర్లను ఏర్పాటు చేయాలని, ఓటరు జాబితాలో ఫోటో, ఇతర మార్పులు ఉన్నట్లయితే వాటిని ఫామ్-8 ద్వారా ఓటర్లతో నమోదు చేయించేలా బిఎల్ఓ లు చర్యలు చేపట్టాలని తెలిపారు.

బిఎల్ఓ రిజిస్టర్, ఓటర్ల నమోదు పత్రాలను కలెక్టర్ పరిశీలించారు. అక్టోబర్ 1, 2023 నాటికీ 18 సంవత్సరాలు నిండిబోయే వారందరూ ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాలని అన్నారు. సెప్టెంబర్ 2, 3 తేదీల్లో పోలింగ్ కేంద్రాలలో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి, పోలింగ్ కేంద్రాల్లో బిఎల్ఓలు డ్రాఫ్ట్ ఫోటో ఎలక్టోరల్ హార్డ్ కాపీ, అన్ని రకాల ఫారాలతో అందుబాటులో ఉంటారని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు.

కలెక్టర్ పర్యటన సందర్భంగా నగర పాలక సంస్థ సహాయ కమీషనర్ సత్యనారాయణ రెడ్డి, ఖమ్మం అర్బన్, రూరల్ తహసీల్దార్లు సిహెచ్. స్వామి, రామకృష్ణ, ఎన్నికల డిటి సంపత్, అధికారులు తదితరులు వున్నారు.

Related posts

రైతు రుణమాఫీ చేయాలని బిజెపి డిమాండ్

Satyam NEWS

పేదల ఇళ్ల నిర్మాణంపై జగన్ కు చిత్తశుద్ధిలేదు

Satyam NEWS

ఎంపీ, ఎమ్మెల్యేలపై సీబీఐ కేసుల్లో అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్

Murali Krishna

Leave a Comment