34.2 C
Hyderabad
May 10, 2024 14: 53 PM
Slider ఖమ్మం

వసతి గృహాలలో మౌలిక సౌకర్యాలు కల్పించాలి

#BC Boys Hostel

వసతి గృహ విద్యార్థులకు మౌళిక వసతుల కల్పన చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. కలెక్టర్ నయాబజార్ బిసి బాలుర వసతి గృహాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పిల్లలను వసతి, మెనూ గురించి అడిగి తెలుసుకున్నారు. వసతిగృహంలో గదులు పరిశీలించారు.

ఎన్ని టాయిలెట్ బ్లాకులు ఉన్నవి పరిశీలించి, పిల్లలకు సరిపోవునంతగా లేవని, టాయిలెట్ బ్లాకు నిర్మాణానికి ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశించారు. పిల్లలు ఏ పాఠశాలలో చదువుతున్నది, ట్యూటర్, పిల్లల చదువు విషయమై అడిగి తెలుసుకున్నారు. డిజిటల్ తరగతులు పిల్లలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. పరిశుభ్రతను పాటించాలని, ఆవరణలో నీరు నిల్వ కుండా చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు.

Related posts

సామాజిక సమానత్వం కోసం పోరాడిన మహనీయుడు

Satyam NEWS

కాగడాలతో నెల్లూరు టీడీపీ నేతల నిరసన

Satyam NEWS

[2022] What Is Familial Combined Hyperlipidemia How Do You Reduce High Cholesterol High Cholesterol Medicine In Patanjali

Bhavani

Leave a Comment