30.7 C
Hyderabad
May 5, 2024 06: 24 AM
Slider పశ్చిమగోదావరి

ట్యాగ్ యింగ్ జరగక పీ ఆర్ సిబ్బందికి ఇబ్బంది

ఏలూరు జిల్లా పంచాయతీ రాజ్ శాఖలో ఉద్యోగులకు ఎంప్లాయిస్ టాగింగ్ సమస్య తలనొప్పిగా మారింది.ఏడాది కాలంగా టాగింగ్ జరగక వేతనాల కోసం అధికారులపై ఆధారపడాల్సి వస్తుందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2021 వరకు పంచాయతీ రాజ్ శాఖలో ప్రాజెక్టు ఇంప్లిమెంటేషన్ యూనిట్(.పి ఐ యు) పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ (పి ఆర్ ఐ ) శాఖలు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఉండేవి 2022 లో జరిగిన.జిల్లాల పునర్విభజన తో పి ఆర్ ఐ (పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్)శాఖ సిబ్బందితో సహా పశ్చిమగోదావరిజిల్లా హెడ్ క్వార్టర్ భీమవరం కు 2022 జనవరి లో తరలిపోయింది.

ఏలూరు జిల్లా హెడ్ క్వార్టర్ లో ఉన్న పి ఆర్ ఐ కార్యాలయాన్ని ప్రభుత్వం పి ఐ యు కి విలీనం చేసింది.అయితే ఏడాది క్రితం నుండి పి ఆర్ ఐ శాఖ ఏలూరులో ఉన్న కార్యాలయాన్ని కాళీ చేయకుండా కొంతమంది సిబ్బందిని ఏలూరు కార్యాలయం లొనే ఉంచుతూ పి ఐ యు కి ఛార్జ్ అప్పజెప్పకుండా కంప్యూటర్ లు .

రికార్డ్ లు .ఫర్నిచర్ కూడా ఇక్కడే ఉంచేసి భీమవరం లో విధులు నిర్వహించాల్సిన కొంత మంది సిబ్బంది ని ఏలూరు కార్యాలయం లొనే పని పాటా లేకుండా కాళీగా ఉంచుతూ వేతనాలు ఇస్తున్నట్టు తెలిసింది.పి ఆర్ ఐ ని పి ఐ యు లోకి విలీనం చేయడం తో పి ఐ యు శాఖ ఏలూరు పి ఆర్ ఐ శాఖలో కొత్త సిబ్బందిని ఏర్పాటు చేసుకుంది.బీమవరం బదిలీ అయిన పి ఆర్ ఐ సిబ్బంది కొంత మంది ఏలూరు లొనే పి ఆర్ ఐ కార్యాలయాన్ని కాళీ చేయకపోవడంతో కొత్తగా ఏలూరు పి ఆర్ ఐ శాఖలో విధులు చేపట్టడానికి వచ్చిన సిబ్బందికి కార్యాలయం కాళీగా లేక కూర్చోవడానికి కుర్చీలు కూడా లేక కాళీగా కాలక్షేపం చేస్తున్నట్టు సమాచారం.ఏడాది కాలంగా పి ఆర్ ఐ. పి ఐ యు శాఖల సిబ్బంది కి ఎంప్లాయిస్ టాగింగ్ జరగక భీమవరం స్టాప్ కి ఏలూరు పి ఐ యు ఈ ఈ ఏలూరు స్టాప్ కి భీమవరం పి ఆర్ ఐ ఈ ఈ లు నేరుగా సిబ్బందికి వేతనాలు అందజేస్తున్నట్టు తెలిసింది.

ఎంప్లాయిస్ జియో టాగింగ్ జరగక పశ్చిమ గోదావరి .ఏలూరుజిల్లాల అధికారుల మధ్య కొంత గందరగోళ పరిస్థితులు ఏర్పడటం తో సిబ్బందికి సకాలం లో వేతనాలు చేతికి అందడం లేదని పి ఐ యు.పి ఆర్ ఐ సిబ్బంది ఇబ్బందులు పడుతున్నట్టు సమాచారం .ఈ పరిస్థితి పై ఏలూరు పి ఐ యు ఈ ఈ రమణ మూర్తి ని వివరణ కోరగా సిబ్బంది కి ఎంప్లాయిస్ జియో ట్యాగింగ్ జరగలేదని ఉద్యోగులకు వేతనాలు సకాలం లో అందజేస్తున్నామని చెప్పారు.

అదేవిధంగా ఏలూరులో ఉన్న పి ఆర్ ఐ కార్యాలయాన్ని డిసంబర్ నెలాఖరుకు ఖాళీ చేయించి ఇక్కడున్న భీమవరం పి ఆర్ ఐ ఉద్యోగులనుకూడా భీమవరం పంపేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారని పి ఐ యు ఈ ఈ రమణ మూర్తి తెలిపారు.

Related posts

దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి

Bhavani

దోచుకుంటున్న ప్రయివేటు ఆసుపత్రులు

Satyam NEWS

ఘనంగా వేం నరేందర్ రెడ్డి కుమారుడి వివాహం

Satyam NEWS

Leave a Comment