33.7 C
Hyderabad
April 29, 2024 02: 47 AM
Slider మెదక్

మతాలకు అతీతంగా సీఎం కేసీఆర్ పాలన

#Jupalli Krishnarao

రాజకీయాల్లో రాత్రికి రాత్రే నిర్ణయం తీసుకోనే పరిస్థితి ఉండదు… ఆలస్యమని భావిస్తున్న వారందరికీ సమాధానం ఒక్కటే నని, ప్రజామోదయోగ్యం వైపే మొగ్గు చూపుతామని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డిలు పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి బీజేపీ నేతలతో భేటీ ముగిసిన అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ…

మభ్యపు మాటలతో మూడోసారి కూడా అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వాన్ని అధికారంలోకి రానివ్వకపోవడమే తమందరి అంతిమ లక్ష్యమన్నారు. అందుకోసం రెండు మెట్లు కాదు… ఎన్ని మెట్లు దిగడానికైనా తాము సిద్ధమన్నారు. బీజేపీ, కాంగ్రెస్ కాదు ఇతరత్రా పార్టీల నుంచి కూడా ఆహ్వానం ఉందన్నారు.

కేసీఆర్ ను అధికారంలోకి రానివ్వదనేదే తమ ప్రధాన ఎజెండా అని త్వరలోనే జెండా ఎంటో ప్రకటిస్తామని తెలిపారు. ప్రస్తుతం జరిగిన భేటిలో కేసీఆర్ ను నిలువరించేందుకు తాము ఏ విధంగా ముందుకు వెళ్తున్నామో బీజేపీ నేతలతో చర్చించినట్లు తెలిపారు. వారు కూడా తమ విధివిధానాలను వెల్లడించారని పేర్కొన్నారు.

ఇంకా చర్చలు తొలిదశలోనే ఉన్నాయని కాస్తా ఆలస్యమైనా ప్రజాభీష్టా నిర్ణయానికే జై కొడతామన్నారు. అంతే తప్ప ఫలానా పార్టీ వైపు తాము మొగ్గుచూపుతున్నాం అని వస్తున్న వార్తలన్ని అవాస్తవమని కొట్టిపారేశారు.

Related posts

పంచాయతీ కార్మికులకు 11వ పీఆర్సీ అమలు చేయాలి

Satyam NEWS

చంద్రబాబుకు కొత్త ఆలోచన వచ్చిందోచ్

Satyam NEWS

సబ్ ప్లాన్ నిధులు ఎస్సీ ఎస్టీల కోసమే ఖర్చు చేయాలి

Satyam NEWS

Leave a Comment