37.2 C
Hyderabad
May 2, 2024 13: 05 PM
Slider ఖమ్మం

పంచాయతీ కార్మికులకు 11వ పీఆర్సీ అమలు చేయాలి

#grampanchayat

గ్రామ పంచాయతీ కార్మికులకు కేసీఆర్ ప్రభుత్వం ప్రకటించిన 11వ పీఆర్సీ ని వెంటనే  అమలు చేసి జీతాలు పెంచాలని ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుద్ధ్య పనులను పంచాయతీ సిబ్బందితో  చేయించవద్దని ఖమ్మం జిల్లా గ్రామ పంచాయతీ కార్మిక సంఘాల జెఏసి డిమాండ్ చేసింది.  మంగళవారం ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఎదుట ధర్నా చౌక్ నుండి పంచాయతీ  కార్యాలయం వరకు జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించిన అనంతరం డిపిఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.

ఎఐటియుసి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మందా వెంకటేశ్వర్లు సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు మాచర్ల గోపాల్ ఐ ఎఫ్ టి యు  మున్సిపల్ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి రామయ్య మాట్లాడుతూ జిల్లాలో గ్రామపంచాయితీ సిబ్బంది పారిశుద్ధ్యం, నర్సరీలు, వాటర్ సప్లై, వీధి దీపాల నిర్వహణ, పన్నులు వసూలు చేయడం, ఆఫీసు నిర్వహణ తదితర పనుల్లో వివిధ కేటగిరీలలో గ్రామ పంచాయతీలలో పనులు చేస్తున్నారని తెలిపారు. వీరికి 2019 అక్టోబరులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జి.ఓ.నెం. 51 ని విడుదల చేసి వేతనాలను రూ.8,500లుగా నిర్ణయించి అమలు చేస్తున్నారని వెల్లడించారు.

జనాభా ఎక్కువ కార్మికులు తక్కువ

2011 జనాభా లెక్కల ప్రకారం ప్రతి 500 మంది జనాభాకు ఒక కార్మికుడు చొప్పున ఖరారు చేసారన్నారు. ప్రస్తుతం పని చేస్తున్న కార్మికులు 2021 లో ఉన్న జనాభాకు సేవలందిస్తున్నారు. 2021 జనాభా లెక్కలను పరిగణిస్తే అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్న ఈ కార్మికులు ఈ పరిధిలో నుండి మినహాయించ బడుతున్నారని, గతంలో ప్రభుత్వం నిర్ణయించిన రూ.8,500లు వేతనం నేటికీ అనేకమందికి అందడం లేదన్నారు.

రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ శాఖల్లో పనిచేసే పర్మినెంట్ ఉద్యోగులు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, పార్ట్ టైమ్, ఫుల్ టైమ్, కంటిజెంట్ సిబ్బందితో పాటు స్కీమ్ వర్కర్లకు కూడా రాష్ట్ర ప్రభుత్వం వేతనాలను పెంచిందని కానీ గ్రామ పంచాయితీల్లో పనిచేస్తున్న సిబ్బందికి మాత్రం వేతనాలు పెంచలేదని అన్నారు. అఖిలపక్ష సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన దళిత ఎంపవవర్మెంట్ సమావేశం సందర్భంగా గ్రామ పంచాయితీ సిబ్బంది వేతనాలు పెంచి వారికి పిఆర్ సి తరహాలో ఉద్యోగ భద్రతకు చర్యలు తీసుకుంటామని ప్రకటించిన నిర్ణయం నేటికీ అమలు చేయకపోవడం సరైంది కాదన్నారు.

ఉద్యోగ భద్రత కలిగించాలి

ముఖ్యమంత్రి  నిర్ణయం వల్ల అత్యధికులు దళితులుగా, పేద కార్మికులుగా ఉన్న గ్రామ పంచాయితీ సిబ్బంది కుటుంబాల్లో కొత్త ఆశలను చిగురింపజేసాయని తెలిపారు.  రాష్ట్రంలో ఇతర ఉద్యోగులకు వేతనాలు పెంచిన విధంగానే గ్రామ పంచా యతీ కార్మికులకు కూడా వేతనాలు పెంచాలని, తగిన ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రస్తుతం పనిచేస్తున్న వారందరికీ వేతనాలు చెల్లించాలని, మల్టీపర్పస్ వర్కర్లందరినీ పర్మినెంట్ చేయాలని, కారోబార్లకు స్పెషల్ స్టేటస్ కల్పించాలని, ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ని అమల్లోకి తక్షణమే తీసుకురావాలని డిమాండ్ చేశారు.

ఆదే విధంగా అక్టోబర్ 4 న ఛలో హైదరాబాద్ కార్యక్రమానికి పంచాయతీ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపు నిచ్చారు.

ఈ ధర్నా కార్యక్రమంలో ఏఐటియుసీ గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పిట్టల మల్లయ్య, నాయకులు డి. రాందాస్, పి.సీతారామయ్య, కె.కోటేశ్వరరావు, డి.రాజగోపాల్, డి. బాబురావు, పెనుగూరి. సీతారాములు, జి.నారాయణ, భద్రు, మంగిలాల్, రామారావు, సిఐటియు పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు రామారావు, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, నాగేశ్వరరావు, ఐఎఫ్ టియు నగర అధ్యక్ష కార్యదర్శులు ఆడెపు రామారావు, కంకణాల శ్రీనివాస్, ప్రగతి శీల పంచాయతీ వర్కర్స్ యూనియన్ నాయకులు టి.వెంకటేశ్వర్లు, ఎం.అప్పారావు, జి.శంఖర్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

మండలి చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన గుత్తా

Satyam NEWS

ప్రజా రాజధానిపై కుట్ర పన్నిన వైసీపీ ప్రభుత్వం

Satyam NEWS

సి బి ఐ టి కళాశాల లో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ క్లబ్ ప్రారంభం

Satyam NEWS

Leave a Comment