32.2 C
Hyderabad
May 13, 2024 22: 45 PM
Slider మహబూబ్ నగర్

గులాబీ కండువాతో వస్తున్న అభిలాష్ రావు ఎవరు?

Kollapur Assembly

రంగినేని అభిలాష్ రావు అంటే ఎవరో తెలుసా? తెలిస్తే చెప్పండి. ఆయనెవరో మహాత్మా గాంధీ అంతటి పాపులర్ వ్యక్తి అన్నట్టు అడిగారు ఆయనెవరో మాకెలా తెలుస్తాడు అంటారా? కరెక్టే. ఆయన మరీ అంత పాపులర్ కాదు కానీ నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో అడుగు పెట్టిన తాజా గులాబి పువ్వు. ఈ పువ్వుకు రెక్కలు మాత్రమే ఉంటే ఎవరూ పట్టించుకోరు.

ఈ పువ్వుకు ముళ్లు ఎక్కువగా ఉన్నాయి. అందుకే పట్టుకుంటే గుచ్చుకుంటాయని ఎవరికి వారు గుంభనంగా ఉండిపోతున్నారు. కొల్లాపూర్ రాజకీయాల్లో వేడిపుట్టిస్తున్న ఈ గులాబి పువ్వు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ నియోజకవర్గంలోనే సొంత ఇల్లు కూడా కట్టించుకునే ప్రయత్నం చేస్తున్నాడంటే రాబోయే రోజుల్లో ఏం జరగబోతున్నదో ఊహించడం పెద్ద కష్టమేం కాదు.

ఇప్పటికే ఇక్కడ కొట్టుకుంటున్న రెండు వర్గాలు

కొల్లాపూర్ నియోజకవర్గ గులాబీ పార్టీ రాజకీయాలు వేడిని పుట్టిస్తున్నాయి. ఇక్కడ ఇప్పటికే రెండు వర్గాలు కత్తులు దూసుకుంటుంటాయి. ఒకటి మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు జూపల్లి కృష్ణారావు వర్గం కాగా మరో వర్గంగా స్థానిక ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ఉన్నారు.

బీరం కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి టకటకా వచ్చేసి గులాబీ పువ్వుగా మారిపోయారు. దాంతో జూపల్లి, బీరం వర్గాలకు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్నది. ఈ రెండు వర్గాల పోరాటం కారణంగా మునిసిపల్ మంత్రి కేటీఆర్ కూడా పర్యటన రద్దు చేసుకుని అటునుంచి అటే వెళ్లిపోయారు. అంత పవర్ ఫుల్ ఈ రెండు వర్గాలు.

ఇక్కడ ఇద్దరి మధ్యలో పరిస్థితి ఎలా ఉంటుందో గత  కొల్లాపూర్ మున్సిపల్ ఎన్నికలు ఒక ఉదాహరణ. జాతీయ పార్టీల పేరే వినిపించలేదు. కానీ గులాబీ పార్టీలోనే రెండు వర్గాల పోరు జరిగింది. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అభ్యర్థుల  మధ్య జరిగిన పోరు అసెంబ్లీ ఎన్నికలను మరిపించాయి.

మూడో వ్యక్తి ఎలా వచ్చాడు? ఎవరు పంపారు?

ఒకే పార్టీలో మాజీ మంత్రి ఉన్నారు, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి వున్నారు. వీరిద్దరినీ కాదని మూడో వ్యక్తి గులాబీ కండువా వేసుకొని వచ్చి నియోజకవర్గంలో ఇప్పుడు తిరుగుతున్నాడు. మరి అతను ఎవరు? వీళ్లకు అతనికి ఏంటి సంబంధం? గులాబీ పార్టీలోకి రావాల్సిన అవసరం ఏముంది?

ఈ ప్రశ్నలకు సమాధానం ఇద్దరిలో ఎవ్వరో ఒకరు చెప్పాలి. ఒక్కరు గేమ్ నడిపిస్తున్నట్లు ఉందని అనిపిస్తుంది. ఇప్పటివరకు నియోజకవర్గంలో అతి చిన్న వయసులో ఉన్న ఎన్నారై రంగినేని అభిలాష్ రావు మెడలో టిఆర్ఎస్ కండువాతో తిరుగుతున్నాడు.

కేటీఆర్ తో దోస్తానా ఉన్నదా?

అధిష్టానంతో సంబంధాలు ఉన్నాయి అంటూ చెప్పుతున్నారు. పక్క జిల్లా మంత్రితో సంబంధాలు ఉన్నాయని తెలుసు. ముఖ్యంగా ఎన్నారైగా తెలంగాణ ఉద్యమం చేసినట్లు, టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ మినిష్టర్ కేటీఆర్ తో దోస్తానం ఉందని చెప్పుకున్నారని తెలిసింది.

ఇప్పటికే నియోజకవర్గ నాయకులతో మంతనాలు జరుపుతున్నారు. తన వర్గాన్ని ఏర్పాటు చెసుకుంటుంన్నారు. ఇది ఇప్పటి వరకు మనకు తెలిసిన విషయం. మరి నేరుగా ఇతను గులాబీ కండువా వేసుకుని ఎందుకు వస్తున్నాడు. ఇతను నియోజకవర్గంలో తిరుగుతుంటే మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఏమి మాట్లాడక పోవచ్చు.

ఎమ్మెల్యేగా కొనసాగుతున్న బీరం హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడవలసిన అవసరం ఉంది. పార్టీలో నాకు తెలియకుండా ఎలా తిరుగుతాడు? అని అధిష్టానాన్ని ప్రశ్నించవచ్చు. ఆ బాధ్యత ఉంది. మరి అలా ప్రశ్నించలేదు. ఇవ్వన్నీ జరుగలేదు. ఇక్కడ  ఎవ్వరిపై అనుమానాలు వ్యక్తం కావాలి?

ఇద్దరిలో ఒకరు గేమ్ ఆడుతున్నారా?

ఇద్దరు టిఆర్ఎస్ లో ఉన్నా కానీ మూడో వ్యక్తి నియోజకవర్గంలో జోక్యం చేసుకుంటున్నాడంటే ఆలోచించాల్సిన విషయమే. ఇవన్నీ ఇద్దరిలో ఎవరో కావాలని నడిపిస్తున్న గేమ్ లా ఉందని తెలుస్తుంది. ఇద్దరిని కాదని టిఆర్ఎస్ లోకి వచ్చి వర్గాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు అంటే ఏదో వర్గాన్ని దెబ్బతీయడానికి జరుగుతున్న కుట్రలా ఉందని కనిపిస్తుంది.

లేక  స్వచ్ఛందంగా అభిలాష్ రావు  నియోజకవర్గంలో ఒక మార్పు కోసం వచ్చాడా?ఈ విషయాలపై  మరికొన్ని రోజుల్లో ఆ రంగు వెనుక ఉన్న వారి సంగతి తెలుసుకుందాం. కొత్తగా వచ్చేవారికి సిద్ధాంతం, ఒక ఆశయం, సంకల్పం ఉంటాయి కదా! అవేవి చెప్పుకోకుండా తిరుగుతున్నాడంటే అస్సలు రంగు సంగతి తెలుసుకోవాల్సిందే.

Related posts

నిరాడంబరంగా ఒంటిమిట్ట కోదండ‌రాముని క‌ల్యాణం

Satyam NEWS

మున్సిపాలిటీ పారిశుద్ధ్య వాహనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

Satyam NEWS

కరోనా పై స్వరూపానందేంద్ర సరస్వతి సందేశం

Satyam NEWS

Leave a Comment