39.2 C
Hyderabad
April 28, 2024 13: 47 PM
Slider నల్గొండ

కార్మిక వ్యతిరేక విధానాలను అందరూ ఎండగట్టాలి

#INTUC

కరోనా వైరస్ మహమ్మారిని అడ్డుపెట్టుకొని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అమలు చేస్తుందని ఐ ఎన్ టి యు సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న గౌడ్ అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు  పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం కూడా కార్మిక, ఉద్యోగ వ్యతిరేక విధానాలను ఏకపక్షంగా అమలు చేస్తుందని, లాక్ డౌన్ వల్ల తీవ్ర కష్టనష్టాలను ఎదుర్కొంటున్న అసంఘటిత, కాంట్రాక్టు, వలస కార్మికుల పట్ల రాష్ట్ర, కేంద్ర పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆయన అన్నారు.

లాక్ డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన కార్మికులను ఆదుకోవాలని, దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించే పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీలో కార్మికులకు మేలు చేసేది ఏమీ కనపడటం లేదని, అందుకు కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే రాష్ట్ర ,కేంద్ర ప్రభుత్వాలు అమలు చేయాలని తాసిల్దార్ కు వినతిపత్రం అందజేశారు. డిమాండ్స్:1.కార్మిక చట్టాల సవరణను వెంటనే నిలిపివేయాలి.

2.ఎనిమిది గంటల పని విధానాన్ని మాత్రమే అమలు చేయాలి.3.బొగ్గు, రక్షణ, ఇన్సూరెన్స్, రైల్వే, బ్యాంకింగ్, ఫార్మా, కమ్యూనికేషన్ రంగాలలో విదేశీ 100% పెట్టుబడులను నిలిపివేయాలి.4.పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలి.5.లాక్ డౌన్ కాలానికి సంబంధించిన పూర్తి వేతనాలను అందించాలి.

6.ఉద్యోగుల అక్రమ తొలగింపులు నిలిపివేయాలి.7.ప్రతి పేద కార్మిక కుటుంబానికి 7500 రూపాయలు చొప్పున ఆరు నెలలు అందించాలి.8.వేతనాల కోతపై టిఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్సును వెంటనే ఉపసంహరించుకోవాలి.9.బొగ్గు బ్లాకులను ప్రైవేటు వ్యక్తులకు వేలం వేయడం ఆపాలి.

10.వలస కార్మికులకు ఉద్యోగ భద్రత, రక్షణ, కల్పించాలి.11.కరోనా నియంత్రణ కొరకు ప్రభుత్వం ప్రజారోగ్య వ్యవస్థను పటిష్టం చేయాలి.12.ఇండియన్ లేబర్ కన్ఫర్మేషన్ సమావేశం వెంటనే పెట్టాలి.13.ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి.

ఈ డిమాండ్లను వెంటనే రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వాలు అమలు చేయనట్లయితే ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని అఖిలపక్ష నాయకులు అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో ఐ ఎన్ టి యు సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న గౌడ్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున రావు, సి ఐ టి యు నాయకులు శీతల రోషపతి, సోమయ్య గౌడ్, వెంకన్న, కోటమ్మ పాల్గొన్నారు.

ఇంకా, బండి గోపి, నాగోల్ మీరా, కోటేశ్వరరావు,పాలకూరి బాబు, గుండు వెంకటేశ్వర్లు, మాజీ జెడ్పిటిసి గల్లా వెంకటేశ్వర్లు, మేళ్లచెరువు ముక్కంటి, గురవయ్య, రామరాజు, రామ్మూర్తి, ములకలపల్లి రామగోపి, లక్ష్మయ్య, వీరస్వామి, పాపయ్య,కోలా మట్టయ్య, రాము,జెట్టి ప్రసాదు, ముశం సత్యనారాయణ, పార్వతి, తదితరులు పాల్గొన్నారు.

Related posts

మొక్కలు పెంచడాన్ని పిల్లలకు అలవాటు చేయాలి

Satyam NEWS

అభాగ్యులకు అండగా సీఎం రిలిఫ్ ఫండ్

Satyam NEWS

అక్రమ రియల్ దందాకు సహాకరిస్తున్న అధికారులపై చర్యలు

Satyam NEWS

Leave a Comment