38.2 C
Hyderabad
May 3, 2024 19: 39 PM
Slider నిజామాబాద్

వీడియో తీయడానికి నువ్వెవడివిరా

#journalist

‘మీటింగ్ వీడియో తీయడానికి నువ్వెవడివిరా.. నిన్నెవడు రమ్మన్నాడు. వీడియో ఎందుకు తిస్తావ్.. మీకు అనుమతి ఎవరిచ్చారు’ అంటూ అధికార పార్టీ ఎంపీపీ భర్త మీడియా జర్నలిస్టుపై దుర్బర్షాలడాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల సర్వసభ్య సమావేశంలో చోటుచేసుకుంది. బుధవారం మండల సర్వసభ్య సమావేశం ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించారు. ఎంపీపీ గైని అనసూయ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో బీజేపీకి చెందిన ఎంపీటీసీ మహిపాల్ యాదవ్ సమావేశ వేదికపై వచ్చి కూర్చున్నారు.

ఈ క్రమంలో ప్రోటోకాల్ అంశాన్ని ఎంపీపీ, జడ్పీటీసీ లేవనెత్తారు. ఎంపీటీసీ వేదికపై నుంచి వెళ్లిపోవాలని, అప్పటిదాకా సమావేశం నిలిపివేస్తామని చెప్పడంతో అక్కడ వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు అక్కడికి చేరుకుని ఎంపీటీసీని బయటకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో జరుగుతున్న ఘటనను మీడియా ప్రతినిధులు కెమెరాల్లో రికార్డు చేస్తుండగా ఎంపీపీ భర్త గైని రమేష్ సమావేశ హాలులోకి చేరుకుని రిపోర్టర్ పై నువ్వెవడివిరా వీడియో తీయడానికి అంటూ దుర్బర్షాలడాడు.

సదరు రిపోర్టర్ ప్రభుత్వం జారీ చేసిన అక్రిడిటేషన్ కార్డు చూపించి తాను ఫలానా చానల్ రిపోర్టర్ ని అని చెప్పినా వినిపించుకోకుండా ఆ కార్డులో ఏముంది అంటూ వ్యాఖ్యానిస్టు నిన్నెవడు వీడియో తీయుమన్నాడు.. నిన్నెవడు మీటింగుకు రమ్మన్నాడు అంటూ దుర్బర్షాలడాడు. ఎంపీపీ భర్త అయితే సమావేశ హాలులోకి ఎలా వస్తారంటూ, మీకేం అర్హత ఉందని మీడియా ఎదురు ప్రశ్నించగా అక్కడ గందరగోళం నెలకొంది. అంతలోనే పోలీసులు అక్కడికి చేరుకుని ఎంపీపీ భర్తను బయటకు తీసుకుని వెళ్తుండగా కూడా నోటికొచ్చినట్టు దుర్భాశలాడుతూనే ఉన్నాడు. దాంతో మిగతా ప్రజాప్రతినిధులు అక్కడికి చేరుకుని విలేకరులతో అలా మాట్లాడటం సరికాదు అని ఎంపీపీ భర్తకు నచ్చజెప్పుతున్నా ఆయన అదే ధోరణిలో దుర్బర్షాలడటం ఆశ్చర్యానికి గురిచేసింది.

ఎంపీపీ భర్త తీరుపై జర్నలిస్టుల ఖండన

సదాశివనగర్‌ మండల ఎంపీపీ భర్త విలేకర్ల పై దుర్భాషలాడడం సరైనది కాదని టిడబ్ల్యు జేఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొక్కల వేణు అన్నారు.. ప్రజల సమస్యలను వెలికి తీయడంలో విలేకరులు ముందంజలో ఉంటారని అన్నారు.. మండల పరిషత్ సర్వసభ్య సమావేశ  కార్యక్రమ కవరేజికి వెళ్లిన విలేకర్లపై దుర్భాషలాడుతూ వారిపై దాడికి యత్నించిన ఎంపీపీ భర్తపై వెంటనే కేసును నమోదు చేయాలని, అలాగే విలేకరులకి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

లేనిపక్షంలో టిడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో సదాశివనగర్ మండల ఎంపీపీ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో టిడబ్యుజేఎప్ జిల్లా అధ్యక్షుడు సిద్దగౌడ్, జాతీయ నాయకులు చారి, మీడియా కన్వీనర్ ప్రవీణ్ గౌడ్, అక్రిడిటేషన్ కమిటీ మెంబర్ కృష్ణమూర్తి, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు

కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తున్న జర్నలిస్టులు

ఎంపీపీ భర్తపై కలెక్టర్ కు ఫిర్యాదు

సదాశివనగర్ మండల ఎంపీపీ అనసూయ భర్త రమేష్ విలేకరులను దుర్భాషలాడినందుకు నిరసనగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ జితేష్ వి పాటిల్ కు యూనియన్లకు అతీతంగా జర్నలిస్టులు వినతిపత్రం అందజేశారు. సదాశివనగర్ మండల కేంద్రంలో జరిగిన సర్వసభ్య సమావేశం కవరేజ్ నిమిత్తం వెళ్లిన జర్నలిస్టులను ఎంపీపీ అనసూయ భర్త రమేష్ అడ్డుకొని తీవ్ర పదజాలంతో దుర్భాషలాడాడని, ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను జర్నలిస్టులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.

అనంతరం జిల్లా కలెక్టర్ స్పందిస్తూ ఈ విషయంపై ఎంపీపీ అనసూయ భర్త రమేష్ పై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు అంజి, శ్రీనివాస్, శ్రీకాంత్, రాము, నాగరాజు, కిషన్, మధు, రామేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాలు న్యూయార్క్, సింగపూర్

Satyam NEWS

విశాఖలో ఎంపీ ఎంవీవీ కుటుంబం కిడ్నాప్ కలకలం

Bhavani

అనాధల రాత మారుస్తానంటున్న”గీత”

Satyam NEWS

Leave a Comment