40.2 C
Hyderabad
April 26, 2024 11: 34 AM
Slider ముఖ్యంశాలు

మన ఊరు మనబడి పనులను వేగంగా చేయాలి

#sabita

మన ఊరు మనబడి పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి  పి. సబితా ఇంద్రారెడ్డి కలెక్టర్ లను ఆదేశించారు. మన ఊరు మనబడి కార్యక్రమం పనుల పురోగతి పై  హైదరాబాద్ నుండి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, టి.ఎస్.ఈ.డబ్ల్యూ. ఐ.డి.సి  చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్య సంచాలకులు శ్రీదేవసేన  లతో కలిసి జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మొదటి దశలో చేపట్టిన 9123 పాఠశాలలో 30 లక్షల కంటే అధిక వ్యయం ఉన్న  పాఠశాలలో కేవలం 15% మాత్రమే గ్రౌండ్ అయ్యాయని, స్థానిక ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ  నామినేషన్ పద్ధతిలో సదరు పాఠశాల పనులు చేపట్టాలని తెలిపారు. ప్రతి మండలంలో 2 మోడల్ పాఠశాలలను ఎంపిక చేసుకున్నామని, డిసెంబర్ నెలాఖరు వరకు  రాష్ట్ర వ్యాప్తంగా 1200 పాఠశాలలను ప్రారంభించేందుకు సన్నద్దం చేయాలని కలెక్టర్లకు మంత్రి సూచించారు.

మోడల్ పాఠశాలలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని, 10% గ్రీన్ బడ్జెట్ వినియోగిస్తూ పచ్చదనం పెంపోందెలా చర్యలు తీసుకోవాలని మంత్రి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన 1200 మాడల్ పాఠశాలలో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని,  క్షేత్రస్థాయిలో రెడ్కో అధికారులకు అవసరమైన సహకారం అందించి పూర్తి చేయాలని అన్నారు.  మన ఊరు మనబడి సంబంధించి ఉపాధి హామీ క్రింద చేపట్టిన పనుల వివరాలు అందిస్తే  వెంటనే నిధులు విడుదలవుతాయని మంత్రి తెలిపారు. మన ఊరు మన బడి కార్యక్రమానికి నిధులకు ఎలాంటి కోరత లేదని, పనుల ఎఫ్‌టిఓ లు జనరెట్ చేసిన వెంటనే నిధుల విడుదల జరుగుతుందని అన్నారు. గడిచిన వారం రోజుల్లో 100 కోట్ల నిధులు  విడుదల చేసామని, సెంట్రల్ పూలింగ్ విధానం ద్వారా ఇక పై  చెల్లింపులు జరుగుతాయని, మొదట పనులు పూర్తి చేసి, ఎఫ్.టి.ఓ లు జనరెట్ చేసిన వారికి నిధులు ముందస్తుగా విడుదలవుతాయని మంత్రి పేర్కొన్నారు. పాఠశాలలకు అవసరమైన ఫర్నిచర్, గ్రీన్ చాక్ బోర్డ్  వచ్చే వారం జిల్లాలకు వస్తాయని, వాటిని మోడల్ పాఠశాలలకు పంపిణీ చేయాలని మంత్రి ఆదేశించారు. మోడల్ పాఠశాలలో ఉన్న పాత ఫర్నిచర్ ను తొలగించాలని,  బీరువాలకు స్ప్రే పెయింటింగ్ వేయాలని, పాడయిపోయిన ఫర్నీచర్ ను ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కండేం చేయాలని అన్నారు.

పాఠశాలల నిర్వహణ కోసం ప్రభుత్వం 130 కోట్లు విడుదల చేసిందని, వాటిని సమర్థవంతంగా వినియోగిస్తూ పారిశుధ్యం, టాయిలెట్స్ నిర్వహణ లో ఇబ్బందులు రాకుండా కలెక్టర్ లు పర్యవేక్షించాలని మంత్రి కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 వేల ప్రాథమిక పాఠశాలల్లో రీడింగ్ కార్నర్స్, గ్రంథాలయాల ఏర్పాటుకు నిర్ణయించి, అవసరమైన పుస్తకాల కొనుగోలు ప్రక్రియ పూర్తి చేస్తున్నామని, ప్రతి జిల్లాలో  గ్రంథాలయ ఏర్పాటుకు అనువైన ప్రాథమిక పాఠశాలలను ఎంపిక చేయాలని మంత్రి సూచించారు.

మన ఊరు మన బడికి సంబంధించి మోడల్ పాఠశాలలతో పాటు మిగిలిన పాఠశాలలో సైతం పనులు వేగవంతం చేయాలని, మార్చి చివరి నాటికి మొదటి దశ నూరు శాతం పూర్తి చేయాలని, ఇంజనీరింగ్ అధికారులు నాణ్యత విషయంలో పకడ్బందీగా ఉండాలని మంత్రి తెలిపారు.  టి.ఎస్.ఈ.డబ్ల్యూ.ఐ.డి.సి చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, పాఠశాల పెయింటింగ్ అంశంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని, నిబంధనలు ప్రకారం పకడ్బందీగా పెయింటింగ్ జరిగేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ ఉండాలని, కలెక్టర్ లు ఉన్నతాధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని కోరారు. 30 లక్షల రూపాయల కంటే అధికంగా ఖర్చు జరిగే పాఠశాలలకు టెండర్లు రాని పక్షంలో స్థానిక ఎమ్మెల్యే సహకారంతో నామినేషన్ ద్వారా పనులు ప్రారంభించాలని కోరారు.

Related posts

ప్రత్యామ్నాయం పరిశీలించాలి

Sub Editor 2

కెమిస్ట్రీలో డాక్టరేట్ సాధించిన పేద విద్యార్ధి

Satyam NEWS

దేవునిపల్లిలో నూతన బ్యాంక్ ప్రారంభం

Satyam NEWS

Leave a Comment