33.7 C
Hyderabad
February 13, 2025 21: 00 PM
Slider ఆధ్యాత్మికం

తిరుమలలో జనవరి 11న శ్రీవారి ప్రణయకలహోత్సవం

tirumala 27

శ్రీవేంకటేశ్వరస్వామివారు తన దేవేరులతో పాల్గొనే కలహ శృంగార భరితమైన ప్రణయ కలహోత్సవం జనవరి 11వ తేదీ శ‌నివారం తిరుమలలో వైభవంగా జరుగనుంది. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకొని సాయంత్రం 4.00 గం.ల అనంతరం స్వామివారు, అమ్మవార్ల ఉత్సవమూర్తులు బంగారు పల్లకీలపై వేరువేరుగా వైభవోత్సవ మండపం నుండి ఊరేగింపుగా బయలుదేరి వరాహస్వామి ఆలయం చెంత ఒకరికొకరు ఎదురేగుతారు.

ఇక్కడ అర్చకులు స్వామి, అమ్మవార్ల తరఫున వేరువేరుగా ఆళ్వారు దివ్యప్రబంధంలోని పాశురాలను స్తుతిస్తారు. ఆ తరువాత అమ్మవార్లు స్వామివారిని నిందాస్తుతి చేసిన అనంతరం ఒకరిపై ఒకరు పూబంతులను విసరడం, స్వామివారు పుష్పఘాతం నుండి తప్పించుకోవడం వంటి ఆసక్తికరమైన సన్నివేశాలతో ఈ ప్రణయకలహ మహోత్సవం ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా వసంతోత్సవాన్ని టిటిడి రద్దు చేసింది. ఈ కార్యక్రమంలో టిటిడి ఉన్నతాధికారులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటారు.

Related posts

సీఎం పుట్టినరోజు మెగా రక్తదాన శిబిరం ప్రారంభం

Sub Editor

సంభేటి శ్రీలత భౌతిక కాయానికి నివాళులు

Satyam NEWS

సింగరేణి కార్మికులకు త్వరలో వేజ్ బోర్డు ఏరియర్స్

mamatha

Leave a Comment