38.2 C
Hyderabad
April 29, 2024 20: 41 PM
Slider కరీంనగర్

శ్రీపాద ఎల్లంపల్లి భూనిర్వాసితులకు చెక్కుల పంపిణీ

అన్ని వర్గాలకు న్యాయం చేయటమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమన్నారు ఎస్సీ అభివృద్ధి, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఈశ్వర్. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం ముక్కట్రావ్ పేట గ్రామంలో ఆర్ ఆండ్ ఆర్ శ్రీపాద ఎల్లంపల్లి 349 మందికి భూనిర్వాసితులకు పునరావాస ప్యాకేజి కింద ప్రతి ఒక్కరికి రూపాయలు 3 లక్షల చోప్పున రూపాయలు 14 కోట్ల 64 లక్షల చెక్కులను మంత్రి కొప్పుల ఈశ్వర్ అందజేశారు.

ముంపు గ్రామాల్లో 18 సంవత్సరాలు నిండిన యువకులకు 2 లక్షల రూపాయలు అందించిన ఘనత కేసీఆర్ కే దక్కిందన్నారు. ఇప్పటికి 475 మంది యువకులకు అందించామని చెప్పారు.సాంకేతిక సమస్యలు అధిగమించి మిగతా వారికి సైతం న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

ముక్కట్రావ్ పేట గ్రామానికి చెందిన 350 కుటుంబాలకు ఇంటికి 3లక్షల చొప్పున పరిహరం ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారి ప్రత్యేక చొరవతో క్యాబినేట్ ఆమోదం తెలిపి మంజూరు తీసుకోవడం జరిగిందని మంత్రి కొప్పుల ఈశ్వర్ గుర్తుచేసారు.

Related posts

ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు

Satyam NEWS

తొలి కేసును చేధించిన సైబ‌ర్ క్రైమ్ పోలీసులు…!

Satyam NEWS

నేను సగర్వంగా చెప్పుకునే ఓ మంచి సినిమా “మాతృదేవోభవ” (ఓ అమ్మ కథ) !!

Satyam NEWS

Leave a Comment