28.2 C
Hyderabad
June 14, 2025 10: 39 AM
Slider హైదరాబాద్

13 నుంచి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్

kite festival

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో 5th ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ఏర్పాట్లు ను రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం ఇతర ప్రభుత్వ అధికారులతో కలసి పర్యవేక్షించారు. ఈ నెల 13 , 14, 15 తేదీల్లో  జరగనున్న అంతర్జాతీయ కైట్, స్వీట్, స్నాక్స్  పెస్టివల్ తో పాటు తెలంగాణ రాష్ట్ర స్థాయి సంప్రదాయక ఆటలను నిర్వహిస్తున్నామన్నారు.

25 దేశాలకు చెందిన వారు ఈ కైట్ ఫెస్టివల్లో పాల్గొంటారని వెల్లడించారు. దేశం నలుమూలల నుండి పెద్ద ఎత్తున కైట్ ప్లేయర్ లు, సందర్శకులు ఈ ఫెస్టివల్లో పాల్గొంటారన్నారు. పరేడ్ గ్రౌండ్లో ఏర్పాట్లను పర్యవేక్షించిన బుర్రా వెంకటేశం, ఈ ఫెస్టివల్ లో కైట్ ల, స్వీట్ ల తో పాటు స్నాక్స్ ఫెస్టివల్ కూడా జరుగుతుందన్నారు. స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ నుండి జింఖానా మైదానం లో పురాతన సాంప్రదాయ బద్ధమైన  క్రీడలు నిర్వహిస్తారు.

రాబోయే కాలంలో వారం రోజుల పాటు ఈ ఫెస్టివల్స్ జరుపుతామన్నారు. అన్ని రకాల సాంప్రదాయబద్ధమైన పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు , షాపింగ్,  వంటకాలు అన్ని ఏర్పాట్లను అందుబాటులో ఉంచుతామన్నారు. ప్రతి ఒక్కరు ఈ సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సందర్శించవచ్చు అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో M D టూరిజం మనోహర్ గారు, GHMC జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ఇతర అధికారులు, పోలీసు శాఖ నుండి అదనపు డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్, ACP బేగంపేట నరేష్ రెడ్డి, ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, టూరిజం అధికారులు శశిధర్ , ఓంప్రకాశ్, ట్రాఫిక్ అధికారులు దాశ్రు నాయక్, వాటర్ వర్క్స్ అధికారులు రఘునందన్ రెడ్డి లతో పాటు అనుబంధ శాఖల ప్రభుత్వ అధికారులు  పాల్గొన్నారు.

Related posts

కౌంటర్: ఎన్నికలు సజావుగా సాగేందుకే ఆర్డినెన్స్‌

Satyam NEWS

చౌకబియ్యం పాలిష్ చేసి దొంగ మార్కెట్ కు తరలింపు

Satyam NEWS

రాజంపేట ను నెల లోపు జిల్లా కేంద్రంగా ప్రకటించక పోతే రాజీనామా

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!