30.7 C
Hyderabad
May 5, 2024 04: 22 AM
Slider ఖమ్మం

నిర్దేశించిన విధంగా రుణాలివ్వాలి

#Madhusudan Raju

బ్యాంకర్లు నిర్దేశించిన విధంగా రుణాలను మంజూరు చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్థానిక సంస్థలు అదనపు కలెక్టర్ మధుసూదన్ రాజు తెలిపారు. ఐడిఓసి కార్యాలయంలో జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రుణ లక్ష్యాలను సాదించాలని చెప్పారు. జిల్లా స్థాయి బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ సమావేశంలో 2023-24 రుణాళికను విడుదల చేశారు.

జిల్లాలో 5599.03 కోట్ల రుణ లక్ష్యం కాగా, అందులో వ్యవసాయనికి 4309.58 కోట్లు, స్మాల్ స్కేల్ పరిశ్రమ లకు 486.45 కోట్లు, విద్యారంగానికి 202.81 కోట్లు, గృహ నిర్మాణానికి 536.19 కోట్లు, ఇతర మౌలిక వసతులకు 50.18 కోట్ల మొత్తం ప్రాధాన్యతా రంగాలకు 5525.21 కోట్లు ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు. బ్యాంకర్లు వివిధ ప్రభుత్వ పధకాల లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు.ఎల్డిఎం రామిరెడ్డి, నాబార్డు డీడీఎం సుజిత్, బ్యాంకుల రీజనల్ మేనేజర్లు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు

Related posts

లాక్ డౌన్ ఎఫెక్ట్: దేశంలో కార్మిక లోకం ఆకలి కేకలు

Satyam NEWS

పూటుగా తాగాలె ఇక పుల్లుగా ఊగాలె

Satyam NEWS

నోటి మాటతోనే నాన్ సెక్రటేరియేట్ సిబ్బంది తరలింపు షురూ

Satyam NEWS

Leave a Comment