37.2 C
Hyderabad
April 30, 2024 12: 47 PM
Slider ప్రత్యేకం

పూటుగా తాగాలె ఇక పుల్లుగా ఊగాలె

o-LIQUOR-INDIA-facebook

దేశంలో మందు కొట్టే వాళ్ల సంఖ్య పెరిగిపోతున్నది. ప్రభుత్వం మంచినీళ్ల సరఫరా కన్నా మద్యం సరఫరానే క్రమబద్ధంగా చేస్తుంటే తాగేవాళ్లు పెరగరూ… పెరుగుతారు కచ్చితంగా పీకల్దాకా తాగేస్తారు. దేశ జనాభాలో 14.6 శాతం మంది తాగుబోతుతే. మరీ ఆసక్తికరమైన అంశం ఏమిటంటే అందులో కోటి మంది ఆడోళ్లే.

దేశ వ్యాప్తంగా మద్యం తాగేవారి లెక్క తీస్తే టాప్‌లో ఈశాన్య రాష్ట్రమైన త్రిపుర ఉంది. అక్కడ 62 శాతం జనాభా లిక్కర్ తాగేవాళ్లున్నారు. రెండో స్థానంలో ఛత్తీస్‌గఢ్ (57.2%), మూడో స్థానంలో పంజాబ్ (51.7%) ఉన్నాయి. 30 శాతానికిపైగా డ్రింకర్స్ ఉన్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు 15 ఉన్నాయి.

తెలంగాణలో 30.4 శాతం, ఏపీలో 26.5 శాతం తాగుబోతులే. ఈ విషయాలన్నీ ఏ చిన్నా చితకా సర్వే సంస్థలు చెప్పిన విషయం కాదు. స్వయంగా కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖ వెల్లడించిన రిపోర్ట్‌లో బయటపడిన చేదు నిజం ఇది. దేశంలో పదేళ్ల వయసుకే కొందరు పిల్లలు మద్యానికి బానిసలవుతున్నారు.

సామాజిక, ఆర్థిక పరిస్థితుల ప్రభావంతో ఈ పరిస్థితి దాపురించింది. మొత్తంగా దేశంలో మద్యం తాగే వాళ్లు 16 కోట్లు ఉండగా వారిలో 95 శాతం 18-45 మద్య వయస్కులే. అయితే 1:17 నిష్పత్తిలో మందు తాగే మహిళలు  ఉన్నారు. అంటే 17 మంది మగవాళ్లకు ఒకరు చొప్పున ఆడవాళ్లు మందు కొడుతున్నారు. సుమారుగా దేశంలో 94 లక్షల మంది వరకు మహిళలు లిక్కర్ తీసుకుంటున్నారు.

మందు ప్రియులు ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్ కంటే దేశీ మద్యానికే ప్రయారిటీ ఇస్తున్నారు. మొత్తం లిక్కర్ తాగే వాళ్లలో మూడొంతులు దేశీ లిక్కర్‌కే ఓటేస్తున్నారు. ఇక కాస్ట్లీ వైన్ తాగే వాళ్లు మన దేశంలో చాలా తక్కువే. ఆల్కహాల్ తీసుకునేవాళ్లలో కేవలం 4 శాతం మాత్రమే వైన్ తాగుతున్నారు.

బీరు ప్రియులు మాత్రం బలంగానే ఉన్నారు. మొత్తం 16 కోట్ల మందిలో 21 శాతం బీర్ తాగేవాళ్లున్నారు. స్ట్రాంగ్ బీర్ తాగేవాళ్లు 12 శాతం ఉంటే, లైట్ బీర్ తాగే వాళ్లు 9 శాతం ఉన్నారు. ఈ షంఖ్యలు… పెంచేందుకు… పెబుత్వాలు… షతవిధాలా… ప్రయత్నిష్తూనే…. ఉన్నాయి…బెల్టు షాపుల నుంచి బార్ల వరకూ.. అందరూ తాగాలె తాగి ఊగాలె..ఛీర్సు

Related posts

సెల్ఫీ పాయింట్: నేను మూర్ఖుడిని మరి మీరో?

Satyam NEWS

వాహనాల రద్దీ లో ఉండిపోయిన సీఐ వెహికిల్…!

Satyam NEWS

ప‌ట్టుకున్న విలువ త‌క్కువే..కానీ సినీ ఫ‌క్కీలో కేస్ ను ట్రేస్ చేసిన ఎస్ఐలు…!

Satyam NEWS

Leave a Comment