అమరావతి నుంచి రాజధానిని తరలించే ప్రక్రియ ప్రారంభం అయిపోయింది. అమరావతి నుంచి హెడ్ ఆఫ్ ది డిపార్టుమెంట్లు, డైరెక్టరేట్లు, కమిషనరేట్లు లాంటి నాన్ సెక్రటేరియేట్ సంస్థలను తరలించాలని మౌఖిక ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే ఎక్కడా ఎవరికి ఇప్పటి వరకూ లిఖితపూర్వక ఆదేశాలు ఇవ్వలేదు.
మౌఖిక ఆదేశాల మేరకు ప్యాకింగ్ కూడా పూర్తి అయింది. బహుశ 20వ తారీఖు నాటికి తరలింపు పూర్తి అవుతుందని భావిస్తున్నారు. విజయవాడ, గుంటూరు ప్రాంతంలో ఉన్న కార్యాలయాలను ఎక్కడకు తరలిస్తున్నారనేది 20వ తారీఖు నాటికి కానీ స్పష్టత రాదు. స్పష్టత వచ్చిన తర్వాత సిబ్బందికి 24 గంటల సమయం ఇచ్చి డ్యూటీలో చేరాలని ఆదేశాలు ఇస్తారు. అంతా మౌఖిక ఆదేశాల ప్రకారమే జరుగుతున్నది.
ప్రభుత్వ సిబ్బంది లో కొందరు లిఖిత పూర్వక ఆదేశాలను అడిగినా హెడ్ ఆఫ్ ద డిపార్టుమెంట్లు ఇవ్వడం లేదు. తాము మౌఖిక ఆదేశాలు మాత్రమే స్వీకరించామని అందువల్ల మీరు కూడా చేయాల్సిందేనని వారు అంటున్నారు. ఇప్పటికే ఫైళ్ల ప్యాకింగ్ పూర్తి అయిపోయింది. ఫర్నీచర్ కూడా పంపించి వేస్తున్నారు కాబట్టి 20వ తారీఖు నుంచి అమరావతిలో కూర్చోడానికి కుర్చీలు కూడా ఉండవు.
హెడ్ ఆఫ్ ద డిపార్ట్ మెంటు కూడా ఉండరు కాబట్టి ఉద్యోగులు తప్పని సరిగా వారు ఎక్కడికి వెళ్లాలంటే అక్కడికి వెళ్లి కూర్చోవాల్సిందే. అమరావతి రైతులు ఎంత మొత్తుకుంటుంటున్నా రాజధాని తరలింపు ప్రారంభం అయిపోయింది.