37.2 C
Hyderabad
May 2, 2024 14: 52 PM
Slider హైదరాబాద్

బీ టెక్ విద్యార్థులకు తగిన నైపుణ్యాలను అందించాలి

#jntuc

JNTUH కూకట్ పల్లిలో బుధవారం JNTUH ప్రోటెక్షన్  ఫోర్స్  ఆధ్యర్యంలో మౌలిక వసతులను అభివృద్ధి చేయటం తో పాటే, విద్యార్థులకు మార్కెట్ అవసరాలకనుగుణంగా తగిన నైపుణ్యాల కోసం  శిక్షణ నిచ్చేందుకు సెమినార్ లను  నిర్వహించి, తరగతి గదులను డిజిటలైజేషన్ కి అనుగుణంగా తయారు చేయాలని ప్రిన్సిపాల్ డా.కె. విజయకుమార్ రెడ్డికి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్ధి నాయకులు శివకృష్ణ, రంజిత్, రాహుల్ లు  మాట్లాడుతూ, విద్యార్థులకు మెస్ బిల్లులను తగ్గించటం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.

వసతిగృహల్లో గతంలో మేం చేసిన ఉద్యమాల కారణంగా మంచాలను తెప్పించటం, రీడింగ్ రూమ్‌లను  ఏర్పాటు చేయటాన్ని మేము స్వాగతిస్తున్నాం  అన్నారు. అదేవిధంగా విద్యార్థులను నైపుణ్యవంతులను చేసే విధంగా ఆయా కోర్సులలో ప్రావీణ్యం ఉన్న వారిని తీసుకు వచ్చి, సెమినార్లను నిర్వహించి, తగు శిక్షణనివ్వాలని , పరిశ్రమల సందర్శనకు తీసుకు వెళ్ళాలని,తరగతి  గదులను, డిజిటలైజేషనికి అనుసరంగా, ప్రోజెక్టరును ఏర్పాటు చేసి, తరగతి గదులలో చదువుకునే వాతావరణం ఏర్పాటు చేయాలని కోరారు.

ప్రతి కోర్సులో కొన్ని ప్రముఖమైన సబ్జెక్కులను, సీనియర్ అధ్యాపకులచే భోధించాలని కోరారు అదేవిధంగా ఒక స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ని ఏర్పాటు చేయాలని, అదేవిధంగా డిపార్ట్మెంట్ ఆవరణలో ఆయా డిపార్ట్ మెంట్కు సంబంధించిన శాస్త్రవేత్తల చిత్రాలను, మన పూర్వ విద్యార్దులు ఎవరైనా బాగా మంచి రంగాల్లో స్తికపడితే వారి  చిత్రాలను ఏర్పాటు చేయాలని తద్వారా ప్రస్తుత విద్యార్థులు సైతం ఏదో సాధిం చాలనే తపనతో తమ చదువును కొనసాగిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్దులు పవన్, చందు, రంజిత్ ,వంశీ , శశి. ప్రీతమ్, సింహాద్రి, దినేష్ సిద్ధార్థ, రాంకి అనీష్  పాల్గొన్నారు.

Related posts

ఎన్నికల కంట్రోల్ రూమ్ తనిఖీ

Satyam NEWS

మద్యం అమ్మకాలను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలి

Satyam NEWS

మళ్లీ మళ్లీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్టు

Satyam NEWS

Leave a Comment