32.2 C
Hyderabad
May 12, 2024 22: 01 PM
Slider ఆదిలాబాద్

పొగాకు ఉత్పత్తుల ప్రచారం నేరం

#tobaco

పొగాకు ఉత్పత్తుల ప్రచారం నేరమని జిల్లా పొగాకు నియంత్రణ విభాగం అధికారి శ్రీకాంత్ అన్నారు. సోమవారం అదిలాబాద్ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని ప్రజలకు అవగాహన కల్పించారు.

ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ పొగాకు ఉత్పత్తుల ప్రచారం కోసం ఎలాంటి స్టిక్కర్లు అంటించ కూడదని అన్నారు. పొగాకు ఉత్పత్తుల ప్రచారం కోట్పా చట్టం ప్రకారం నేరమన్నారు. చట్టంలోని సెక్షన్ 5 ప్రకారం రూ. 5000 జరిమానాతోపాటు రెండేళ్ల జైలి శిక్ష విధించడం జరుగుతుంది అన్నారు.

సెక్షన్ 7,8,9,10 ప్రకారం ప్రతి పొగాకు ఉత్పత్తులపై నిర్ణీత హెచ్చరికలు ఉండవలెను. పొగాకు ఉత్పాదనలు గల నికోటిన్ మరియు తారు మోతాదులు సూచించాలని తెలిపారు. 80 శాతం కాన్సర్ బొమ్మతోకూడిన హెచ్చరిక ఉండాలన్నారు. సిగరెట్ పాకెట్లపై తయారు తేదీ, ధర, తయారు చేసిన వారి సమాచారం ముద్రించి ఉండాలని సూచించారు. నిబంధనలు పాటించాలని, లేకపోతే జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు.

ఈ సందర్భంగా బహిరంగ ధూమపానం చేసిన ముగ్గురికి జరిమానాలు విధించారు. ఆయన వెంట తనిఖీ బృందం సభ్యులు చిరంజీవి, కొమురయ్య, వెంకట్ స్వామి ఉన్నారు.

Related posts

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో చైనాకు పరాభవం

Satyam NEWS

ఏలూరు లో బ్రాహ్మణ సంఘాల ఆత్మీయ కలయిక..!

Satyam NEWS

“జిన్నా” చిత్రంలో సింగర్స్ గా పరిచమైన అరియనా, వివియనా

Satyam NEWS

Leave a Comment