37.7 C
Hyderabad
May 4, 2024 12: 01 PM
Slider ఖమ్మం

విద్యా ప్రమాణాలు పెంచేందుకే తొలిమెట్టు

#tolimettu

విద్యార్థుల  విద్యా ప్రమాణాలు పెంచేందుకు తొలిమెట్టు కార్యక్రమాన్ని చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు.  స్థానిక జిల్లా పంచాయతీ మౌళిక వసతుల కేంద్ర భవనంలోని సమావేశ మందిరంలో మండల విద్యాధికారులు, తొలి మెట్టు నోడల్ అధికారులు, ప్రధానోపాధ్యాయులతో  తొలి మెట్టు కార్యక్రమంపై కలెక్టర్ ఖమ్మం నియోజకవర్గ స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులకు కనీస అభ్యాసన సామర్ధ్యాలతో పాటు తరగతికి సంబంధించిన అభ్యాసన ఫలితాలు సాధించేలా కృషి చేయాలని అన్నారు. ప్రాథమిక స్థాయి పిల్లలు,  అక్షరాలను గుర్తించడం, పదాలు చదవడం,  బేసిక్ మ్యాథ్స్ పై పట్టు సాధించేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. ప్రతి ఒక పిల్లవాడు చక్కగా చదువుకోవాలి,  రాయాలి అదేవిధంగా బేసిక్ మ్యాథ్స్ తెలిసేలా ఈ కార్యక్రమ కార్యాచరణ చేయాలన్నారు. 

చదువులో వెనుకబడి ఉన్న పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రాథమిక  అభ్యసన వైపు తీసుకువెళ్లాలని కలెక్టర్ సూచించారు. స్వల్పకాలిక లక్ష్యాలను ఏర్పరచుకొని గత నవంబర్ మాసం వరకు నిర్దేశించిన లక్ష్య సాధన, సాధనకు చేపట్టిన చర్యల గురించి ప్రధానోపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితర ఇన్ పుట్ లన్ని ఉన్నట్లు ఫలితం రావాలని ఆయన అన్నారు. రెగ్యులర్ తరగతులతోనే తొలిమెట్టు కార్యక్రమ అమలు చేయాలన్నారు. ప్రధానోపాధ్యాయులు కార్యోన్ముఖులు అయితే సాధన ఏమాత్రం కష్టం కాదని ఆయన తెలిపారు. ఈ నెల 20 లోగా తరగతిలోని ప్రతి విద్యార్థి లక్ష్యం మేరకు ప్రగతి సాధనకు చర్యలు చేపట్టాలన్నారు. ఈ  సమావేశంలో శిక్షణా అసిస్టెంట్ కలెక్టర్ రాధిక గుప్తా, మండల విద్యాధికారి ఎం. శ్రీనివాస్,  ఏఎంఓ రవికుమార్, ఎంఐఎస్ రామకృష్ణ, తొలి మెట్టు నోడల్ అధికారులు, ఖమ్మం నియోజకవర్గంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

తెలంగాణాలో సెటిలర్స్ చూపు ఎటు?

Satyam NEWS

గజ గజ వణుకుతున్న భారత దేశం

Satyam NEWS

నిర్మల్ లో అభివృద్ధి పనులను వేగవంతం చేయండి

Satyam NEWS

Leave a Comment