37.2 C
Hyderabad
May 1, 2024 11: 51 AM
Slider పశ్చిమగోదావరి

ధాన్యం కొనుగోలు కు సంచుల కొరత

#grains

ఏలూరు జిల్లాలో సొసైటీల ద్వారా కొనుగోలు చేస్తున్న ధాన్యానికి సంచులు కొరత ఏర్పడింది. దీంతో రైతులు సొసైటీల ధాన్యం తరలించడానికి పడరాని పాట్లు పడుతున్నారు. రైతుల ఇబ్బందులు చూసి ధాన్యం సేకరించే సొసైటీల సంచులు సరఫరా చేయాలని జిల్లా అధికారులకు పెట్టుకుంటున్న మొర జిల్లా అధికారుల చెవికి తాకడం లేదని సొసైటీ ల ప్రెసిడెంట్ లు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ ప్రక్క వాతావరణం లో ఆకస్మిక మార్పులు వల్ల తుపాను సూచనలు ఏర్పడటం తో కల్లాలలో ఉన్న పంట వర్షాలకు తడిసిపోతుందనే దిగులుతో రైతులు ఉన్నారు.

చేతికొచ్చిన పంట నోటికండకుండా తుపానుకు తడిసి ముద్దైతే ధాన్యం కొనుగోలు కేంద్రాలలలో కనీస మద్దతుదర పలకదేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.రైతుల మనోవేదన చూసి కొంత మంది సొసైటీల అధ్యక్షులు సంచులకోసం ధాన్యం దిగుమతి చేసుకునే లేవి రైస్ మిల్లు ల యజమానులు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

Related posts

విధి నిర్వహణలో తీవ్రంగా గాయపడిన విద్యుత్ ఉద్యోగి

Satyam NEWS

హైదరాబాదులో మళ్లీ తెరుచుకోనున్న మార్కెట్లు

Satyam NEWS

వీర తెలంగాణ అగ్గిరవ్వ దొడ్డి కొమరయ్య

Satyam NEWS

Leave a Comment