28.7 C
Hyderabad
May 6, 2024 00: 33 AM
Slider విజయనగరం

ప్రాభవం కోల్పోతున్నప్రాచీనమైన బొబ్బిలి చరిత్ర!

bobbali1

విజయనగరం సామ్రాజ్య విశిష్టత తెలుసుకోవాలన్నా, తాండ్రపాపారాయుని స్మృతులు తెలుసుకోవాలన్నఅటు విజయనగరం, ఇటు బొబ్బిలి ఎంతో చారిత్రకమైన స్థలాలు. అంతేనా ఎంతో ఘన చరిత్ర కలిగిన ప్రదేశాలు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బొబ్బిలి పట్టణం, కరోనాతో వచ్చిన లాక్ డౌన్ కారణంగా నిర్లక్ష్యానికి గురవుతోంది. ఎంతోమంది పర్యాటకులు బొబ్బిలి చరిత్ర తెలుసుకోవడానికి బొబ్బిలి సందర్శిస్తూ ఉండేవారు. గత మార్చి నెల నుంచి కరోనా లాక్డౌన్ కారణంగా అన్నిపర్యాటక ప్రాంతాలకు తాళాలు పడ్డాయి. అన్ని పరిస్థితులు సాధారణ స్థితికి వస్తున్నా, అధికారులు ఎవ్వరు కూడా పర్యాటక పునరుద్ధరణపై దృష్టి సారించలేదు. గత కొద్ది నెలల క్రితం నుంచి పెళ్ళిళ్ళు, పుట్టిన రోజులు, పండగలు, పిక్నిక్ లు, ప్రారంభోత్సవాలు, ఊరేగింపులు అన్నీజరుపుకుంటున్నా, కేవలం పర్యాటక రంగానికి మాత్రం కరోనా సాకుతో పక్కన పెట్టారు. ఇప్పటికైనా పాలకులు మేల్కొని బొబ్బిలి పర్యాటక కేంద్రాలను పునరుద్ధరించి పర్యాటకులను ఆహ్వానిస్తే బొబ్బిలికి మరింత పేరు వచ్చే అవకాశం ఉంది. అధికారులు ఈ దిశగా ముందడుగు వేయాలని ప‌ట్ట‌ణ‌వాసులు కోరుతున్నారు.

Related posts

ఇందిర జయంతి వేడుకలను ఘనంగా జరుపుకుందాం

Bhavani

దాసోజు శ్రవణ్ తో డాక్టర్ కేతూరి భేటీ

Satyam NEWS

2024లో మోడీనే మూడోసారి ప్రధాని.. అమిత్ షా

Sub Editor

Leave a Comment