38.2 C
Hyderabad
April 29, 2024 13: 41 PM
Slider రంగారెడ్డి

ఇందిర జయంతి వేడుకలను ఘనంగా జరుపుకుందాం

స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతిని ఘనంగా జరుపుకుందామని కల్వకుర్తి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు విజయ కుమార్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శనివారం స్వర్గీయ భారత మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ జయంతి వేడుకలను నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని ఇందిరా గాంధీ కమాన్ దగ్గర ఉదయం 11 గంటలకు ఘనంగా జరుపుతున్నామని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఐసీసీ సెక్రెటరీ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చెల్లా వంశీ చందర్ రెడ్డి హాజరవుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు యూత్ కాంగ్రెస్ ఎన్.ఎస్.యు.ఐ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Related posts

ఆశల ఐక్య పోరాటాల వల్లనే సమస్యల పరిష్కారం

Satyam NEWS

గ్రీన్ ఛాలెంజ్: మొక్కలు నాటిన ఇస్మార్ట్ సావిత్రి

Satyam NEWS

విశాఖ చుట్టుపక్కల 6 వేల ఎకరాలు కొన్న వైకాపా నేతలు

Satyam NEWS

Leave a Comment