28.7 C
Hyderabad
May 6, 2024 10: 11 AM
Slider హైదరాబాద్

బేగంపేట పరిధిలో మూడు నెలలపాటు ట్రాఫిక్‌ మళ్లింపు

#cvanand

నాలా అభివృద్ధి కార్యక్రమం (ఎస్‌ఎన్‌డీపీ) కింద రసూల్‌పుర-రాంగోపాల్‌పేట ఠాణాల మధ్య రహదారి నాలా పునరుద్ధరించనున్న నేపథ్యంలో ఈ మార్గంలో మూడు నెలలపాటు ట్రాఫిక్‌ మళ్లించనున్నారు. వచె ఏడాది  ఫిబ్రవరి  21వ తేదీ  వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయని నగర పోలీసు కమీషనర్ సి‌వి ఆనంద్ తెలిపారు. బేగంపేట ఫ్లైఓవర్‌ నుంచి కిమ్స్‌ ఆసుపత్రి, మినిస్టర్‌ రోడ్‌, రాణిగంజ్‌, నల్లగుట్ట, వీపీఎన్‌ఆర్‌ మార్గ్‌ వైపు వెళ్లేందుకు రసూల్‌పురా టి-జంక్షన్‌ వద్ద యూటర్న్‌ తీసుకునేందుకు అనుమతించరని,  కిమ్స్‌ ఆసుపత్రి, మినిస్టర్‌ రోడ్‌, రాణిగంజ్‌, నల్లగుట్ట వైపు రసూల్‌పుర నుంచి వెళ్లే వాహనాలు సీటీఓ ఫ్లైఓవర్‌ వరకు వెళ్లి యూటర్న్‌ తీసుకోవాలి. హనుమాన్‌ టెంపుల్‌ నుంచి ఫుడ్‌వరల్డ్‌, సింధీ కాలనీ, రాంగోపాల్‌పేట ఠాణా, కిమ్స్‌ ఆసుపత్రుల వైపు వెళ్లొచ్చన్నారు. రాణిగంజ్‌, నల్లగుట్ట, పీవీఎన్‌ఆర్‌ మార్గ్‌ నుంచి వచ్చే వాహనాలను రసూల్‌పుర వైపు అనుమతించరని,  అటువైపుగా వచ్చే వాహనాలు రాంగోపాల్‌పేట ఠాణా, సింధికాలనీ, ఫుడ్‌వరల్డ్‌, హనుమాన్‌ టెంపుల్‌ మీదుగా వచ్చి ఎడమవైపు తీసుకుని రసూల్‌పుర వైపు వెళ్లే వీలుందన్నారు.  సికింద్రాబాద్‌ వైపు నుంచి కిమ్స్‌ ఆసుపత్రి వైపు వచ్చే వాహనాలు హనుమాన్‌ టెంపుల్‌ నుంచి ఎడమకు తీసుకుని, ఫుడ్‌ వరల్డ్‌, సింధీ కాలనీ, రాంగోపాల్‌పేట ఠాణా మీదుగా ఎడమకు మళ్లి కిమ్స్‌ వైపు వెళ్లవచ్చు అన్నారు.  భారీ వాహనాలు మినిస్టర్‌ రోడ్‌ వైపు వెళ్లాలంటే రాణిగంజ్‌ మార్గంలో రాకపోకలు సాగించాలన్నారు.

Related posts

3 మెడికల్‌ కాలేజీల ఏర్పాటుకు ఆమోదం

Murali Krishna

2వ విడత కంటి వెలుగును విజయవంతం చేయాలి

Bhavani

గంజాయి క్షేత్రాలపై దాడులు ముగ్గురిపై కేసు

Sub Editor

Leave a Comment