29.7 C
Hyderabad
May 1, 2024 07: 40 AM
Slider ప్రత్యేకం

16 ఏళ్లకే ఓటు హక్కు

#newzealand

ఎన్నికల్లో ఓటు హక్కు వయసుపై ప్రపంచ దేశాల్లో భిన్న వాదన ఉంది. ఇప్పటికే కొన్ని దేశాలు 16ఏళ్ల వయసు వారికే ఓటు హక్కు కల్పిస్తుండగా,  తాజాగా న్యూజిలాండ్‌లోనూ ఈ విషయం చర్చనీయాంశమయ్యింది. 16ఏళ్ల వయసు వారికి ఓటు హక్కు కల్పించకపోవడం వారిపై వివక్ష చూపించడమేనని పేర్కొంటూ అక్కడి సుప్రీం కోర్టు చెప్పడం అక్కడ చర్చకు దారితీసింది. దీనిపై స్పందించిన ఆ దేశ ప్రధాని జసిండా ఆర్డెర్న్‌ వ్యక్తిగతంగా దీనికి మద్దతిస్తానని, పార్లమెంటులోనూ త్వరలో దీనిపై ఓటింగ్‌ నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఎన్నికల్లో కేవలం 18ఏళ్ల వయసు వారికే ఓటు హక్కును కల్పించడం యువతపై వివక్షత చూపించడంతోపాటు వారి మానవ హక్కులను హరించడమేనంటూ న్యూజిలాండ్‌ సుప్రీం కోర్టు ఇటీవల తీర్పు చెప్పింది. దీనిపై ప్రధాని జెసిండా ఆర్డెర్న్‌ స్పందిస్తూ ఓటు వయసు 18 నుంచి 16ఏళ్లకు తగ్గించేందుకు వ్యక్తిగతంగా తనకు అంగీకారమేనన్నారు. అయితే ఇందుకు అవసరమైన బిల్లుకు పార్లమెంటులో 75శాతం మంది సభ్యుల మద్దతు అవసరమన్నారు. ఇది కేవలం తనకు, ప్రభుత్వానికి సంబంధించిన విషయం కాదని అధికార లిబరల్‌ లేబర్‌ పార్టీ నేత, ప్రధానమంత్రి ఆర్డెర్న్‌ పేర్కొన్నారు.

యువతపై అత్యంత ప్రభావం చూపే వాతావరణ సంక్షోభం వంటి కీలకమైన సమస్యలపై ఓటింగ్‌లో పాల్గొనేందుకు వారికి అవకాశం ఉండాలన్నారు. అందుకే దీనికి సభ్యులందరూ మద్దతు పలకాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు లిబరల్‌ గ్రీన్‌ పార్టీ మద్దతు పలికినప్పటికీ, రెండు ప్రధాన ప్రతిపక్షాలు మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఎన్నికల్లో పాల్గొనేందుకు కనీస ఓటింగ్‌ వయసుపై చాలా దేశాల్లో చర్చ జరుగుతూనే ఉంది. ఇప్పటికే ఆస్ట్రియా, బ్రెజిల్‌, క్యూబా, ఈక్వెడార్, మాల్టా వంటి దేశాల్లో 16ఏళ్ల వయసుకే ఓటు హక్కును కల్పిస్తున్నారు. న్యూజిలాండ్‌లో గతంలో ఓటింగ్‌ వయసు 21ఏళ్లుగా ఉండగా, 1969లో దానిని 20ఏళ్లకు కుదించారు. ఆ తర్వాత 1974లో మరోసారి సవరణ చేసి ఓటు హక్కు వయసును 18 ఏళ్లకు తగ్గించారు.

Related posts

వీర తెలంగాణ అగ్గిరవ్వ దొడ్డి కొమరయ్య

Satyam NEWS

కుమార్ ను పరామర్శించిన బాదం ప్రవీణ్

Satyam NEWS

కుష్టు వ్యాధి నిర్మూలన పై ఆరోగ్య సిబ్బంది కి ఒకరోజు శిక్షణ

Satyam NEWS

Leave a Comment