సామాన్యులకు ఏదైనా పెద్ద ఆపరేషన్ జరగాలన్న…ప్రభుత్వం అందిస్తున్న ఆరోగ్య శ్రీ కార్డు ఉంటే సరిపోతుంది. మరి వృత్తిలో ఉంటున్న అదీ పోలీస్ ఉద్యోగం చేస్తున్న సిబ్బందికైతే..భద్రత పథకం ఉంది కదా..! అయితే ఇప్పుడా పోలీస్ భద్రత పథకం…ఉద్యోగికి అందకపోవడంతో…స్నేహితుని వద్ద అప్పు చేసి తక్షణం తనకు ఆపరేషన్ పూర్తి చేసి ఎంత వేగరంగా తిరిగి విధులలో చేరిపోవాలన్నయోచనతో ఉన్నాడా ట్రాఫిక్ కానిస్టేబుల్. అదీ ప్రధాన జంక్షన్ లో హెల్మెట్ లేకుండా వెళుతున్న ఓ వాహనాన్ని ఆపడం తప్పయింది…ఆ కానిస్టేబుల్ కు. పర్యవసనం…పక్కకు ఆపినట్టే ఆపి…ఒక్కసారి ఝలక్ ఇచ్చి… బండితో ఆ ఆపిన ట్రాఫిక్ కానిస్టేబుల్ ను ఢీ కొట్టి అక్కడ నుంచీ పరారయ్యాడో బైక్ చోదకుడు.
ఆ కానిస్టేబుల్ కు చేతి మణికట్టు విగరడంతో చికిత్సకై హాస్పటల్ పాలైనాడు.అయితే విషయం తెలుసుకున్న పోలీస్ బాస్…తక్షణమే ఢీ కొట్టిన వ్యక్తిని పట్టుకోవాలని ఆదేశించడంతో టూటౌన్ పోలీసులు అతగాడిని పట్టుకుని కేసు కట్టి అరెస్ట్ చేసారు. వివరాల్లోకి వెళితే…విజయనగరంలో గడచిన రెండు రోజుల నుంచీ ట్రాఫిక్ పోలీసుల…జరీమానాలు వేయడం.. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖిలు చేపట్టడం జరుగుతునే ఉంది. ఈ క్రమంలో ట్రాఫిక్ డీఎస్పీ విశ్వనాధ్ ఆదేశాలతో సీఐ రంగనాధ్ సూచనలతో ట్రాఫిక్ ఎస్ఐ త్రినాధ్,కానిస్టేబుల్ సింహాచలంకు..నగరంలోకి కొట వద్ద ఈ చలానల తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ఆ తనిఖీల్లో భాగంగా కోట నుంచీ దాసన్నపేట వెళుతున్న ఓ బైక్ అదీ హెల్మెట్ లేకుండా… సెల్ ఫోన్ మాట్లాడుతూ వెళుతుండటం చూసి ట్రాఫిక్ ఎస్ఐ త్రినాధ్ ఆదేశాలతో పీసీ సింహాచలం వాహనదారుడిని ఆపి పక్కకు తీసుకెళ్లే క్రమంలోనే ఆపినట్టు ఆపి ఒక్కసారి పక్కకు వెళ్లి…ట్రాఫిక్ పీసీని ఢీ కొట్టి బైక్ పై రయ్యమంటూ తప్పించుకుని పారిపోయాడు. ఆ వెంటనే పీసి సింహాచలం పక్కకు పడిపోవడంతో చేయి మోపడంతో…ఎడమ చెయ్యి ప్రాక్ఫర్ అయ్యంది. క్షణాలలో ట్రాఫిక్ ఎస్ఐ త్రినాద్ సెట్ లో తన సిబ్బంది సహయంతో ఓ ప్రైవేటు హాస్పటల్ లో చికిత్సకై చేర్పించారు.
విషయం తెలుసుకున్న ఎస్పీ దీపిక ట్రాఫిక్ డీఎస్పీని నిందితుడ్ని పట్టుకోవాలని ఆదేశించడంంతో…హుటాహుటిన రాత్రికి రాత్రే…పోన్ ,బండి నెంబర్ ద్వారా నిందితుడ్ని పట్టుకుని టూటౌన్ పీఎస్ కు అప్పచెప్పారు. ఇంతవరకు బానే ఉంది…చేయి ప్రాక్ఛర్ అయిన ట్రాఫిక్ పీసీ సింహాచలం పరిస్థితి ఏంటీ..పోలీస్ భద్రత వర్తిస్తుందా ..? లేదా అని ప్రశ్నస్తోంది.. “.సత్యం న్యూస్.నెట్ “