29.7 C
Hyderabad
May 4, 2024 06: 58 AM
Slider ముఖ్యంశాలు

కోటప్పకొండ వచ్చే భక్తులు పాటించాల్సిన ట్రాఫిక్ నిబంధనలు

#DSP Vijayabhaskara Rao

మహా శివ రాత్రి పర్వదినం కోటప్పకొం డకు వచ్చే భక్తులు పోలీస్ శాఖ అమలు చేస్తున్న ట్రాఫిక్ నిబంధనలు పాటించి తిరునాళ్లు విజయవంతానికి సహకరించాలని పల్నాడు జిల్లా నరసరావుపేట డీఎస్పీ విజయభాస్కరరావు సూచించారు.

కాలినడకన స్వామి దర్శనానికి వెళ్లే భక్తులను ఘాట్ రోడ్డులో అనుమతించమని చెప్పారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ ఈ నిబంధన అమలు చేస్తామని, తద్వారా ఘాట్ రోడ్డులో వాహనాల రద్దీని నియత్రించేందుకు దోహదపడుతుందన్నారు. అలాగే వీఐపీ పాసులు ఉన్న వారు నరసరావుపేట వైపు నుంచి పెట్లూరివారిపాలెం మీదుగా ఘాట్ రోడ్డులో వాహనాల పార్కింగ్ స్థలంలో తమ వాహనాలు నిలిపి ఆర్టీసీ బస్సుల ద్వారా పైకి వెళ్లాలన్నారు.

చిలకలూరిపేట వైపు నుంచి వచ్చే వీఐపీ పాసు దారులు యూటీ కూడలి నుంచి క్రషర్ల మార్గం మీదుగా వీఐపీ పార్కింగ్ స్థలానికి చేరుకోవాలన్నారు. వీఐపీ పాసులు కొండ పైకి వెళ్లేందుకు మాత్రమే అని, దైవ దర్శ నానికి కాదని పేర్కొన్నారు. నరసరావుపేట నుంచి కోటప్పకొం డకు వచ్చే ప్రభలు మధ్యాహ్నం 2 నుంచి వయా యల్లమంద, గురవాయపాలెం మీదుగా సాయంత్రం 6 గంటలలోపు కొండకు చేరుకోవాలన్నారు. కోటప్పకొండ నుంచి తిరిగి వెళ్లే ట్రాఫిక్ రెడ్ల సత్రం వైపు నరసరావుపేట వెళ్లే వాహనాలు చిలకలూరి పేట మేజర్ కాలువ మీదుగా ఏర్పాటు చేసిన దారిలోనే వెళ్లాలన్నారు.

గురువాయపాలెం, యల్లమంద మీదుగా అనుమతించ మని తెలిపారు. వీఐపీ, సాధారణ పార్కింగ్ ప్రదేశాల నుంచి తిరిగి వెళ్లే ట్రాఫిక్ కొండకావూరు, పమిడిమర్రు మీదుగా విను కొండ రహదారిపైకి చేరుకుని వెళ్లాలని పేర్కొన్నారు. సంతమా గులూరు, అద్దంకి మండలాల నుంచి వచ్చే భక్తులు మన్నెపల్లి నుంచి లక్ష్మీపురం, పెట్లూరివారిపాలెం మీదుగా సాధారణ పార్కింగ్ స్థలానికి చేరుకోవాలని చెప్పారు. సంతమాగులూరు, అద్దంకి మండలాల నుంచి ప్రభల వద్దకు వచ్చేవారు మన్నేపల్లి, తంగెడుమల్లి, గురిజేపల్లి, యూటీ మీదుగా ప్రభల ప్రాంతానికి చేరుకోవాలని చెప్పారు.

మన్నేపల్లి నుంచి కోటప్పకొండ వద్దకు ట్రాఫిక్ ను అనుమతించరని, ఏఎం రెడ్డి కళాశాల ఎదురుగా పోలీస్ చెక్ పోస్టు నుంచి వాహనాలను అనుమతించమని తెలిపారు. చిలకలూరిపేట నుంచి ప్రభల వద్దకు వచ్చే ట్రాఫిక్ యడవల్లి నుంచి అట్టల ఫ్యాక్టరీ ఎదురుగా గల దారి నుంచి కట్టుబడివారిపాలెం మీదుగా రావాలన్నారు. కోటప్పకొండ నుంచి తిరిగి చిలకలూరిపేట వెళ్లే వారు యూటీ జంక్షన్ నుంచి కట్టుబడివారిపాలెం, కమ్మవారిపాలెం మీదుగా చెరువురోడ్డులో వెళ్లాలని సూచించారు

Related posts

పత్తికొండలో ఘోర రోడ్డు ప్రమాదం: ఇద్దరి మృతి

Satyam NEWS

చెప్పరా….

Satyam NEWS

బతుకమ్మ చీరలు పంచిన ఎమ్మెల్యే మాగంటి

Satyam NEWS

Leave a Comment