39.2 C
Hyderabad
May 3, 2024 14: 34 PM
Slider కృష్ణ

ముస్లిం విద్యార్ధులకు ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ కు శిక్షణ

#FarookhShibli

ఎంసెట్ పరీక్షలు రాసి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ చేయబోతున్న ముస్లిం విద్యార్థినీ విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఉచిత కెరీర్ గైడెన్స్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు ఫారూఖ్ షూబ్లీ తెలిపారు. విజయవాడ గాంధీ నగర్ లో ఈనెల 8 న సన్ స్క్వేర్ హోటల్ లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.

దీనికి సంబంధించిన వాల్ పోస్టర్ ను ఆయన నేడు ఆవిష్కరించారు. ఇన్స్పైర్(inspire) అకాడమీ వారి సహకారంతో రాష్ట్రంలో ని పలు ఇంజనీరింగ్ కళాశాలలో 20 మంది మెరిట్ విద్యార్థుల కు ఉచితంగా విద్య ను అందిస్తామని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఎంసెట్ తరువాత మైనారిటీలకు లభ్యమయ్యే సీట్లు కాలేజీల వివరాలు ఏ కోర్స్ వలన ఎక్కువుగా ఉపాధి లభిస్తుంది అనే అంశంపై నిపుణులు సలహాలు ఇస్తారని ఆయన అన్నారు.

ఇస్లాంలో విద్య ప్రాధాన్యత మరీ ముఖ్యంగా మహిళలకు విద్య ప్రాధాన్యత అనే అంశం పై  ప్రత్యేక చర్చ నిర్వాహిస్తామని అన్నారు. మైనారిటీ బాలికలు విద్య లో రాణించాలని వారికి అండగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ లు ఎటువంటి స్కీమ్ లు ఇస్తున్నారో అవగాహన కలిపిస్తామని అన్నారు.

కొన్ని జిల్లాల నుండి స్పందన  బాగుంది అన్నారు. 200 మంది కి పైగా మైనారిటీ విద్యార్థులు హాజరుకానున్నారని తెలిపారు. ఈ పత్రికా సమావేశంలో మౌలానా హుస్సేన్, మొహమ్మద్ యూనిస్ లు పాల్గొన్నారు.

Related posts

జగన్ సలహాదారుడు రామచంద్రమూర్తి రాజీనామా

Satyam NEWS

T20 World Cup : సెమీస్ కు దూసుకెళ్లిన ఇంగ్లాండ్

Satyam NEWS

ఉమ్మడి ఆదిలాబాద్ లో టిక్కెట్ల పంచాయితీ

Satyam NEWS

Leave a Comment