27.7 C
Hyderabad
May 4, 2024 10: 04 AM
Slider హైదరాబాద్

శుక్రవారం గ్రీన్ డే పాటించాలని మంత్రి తలసాని పిలుపు

#Minister Talasani

హైదరాబాద్ మహానగరంలో జరుగుతున్న హరిత హరం భాగంగా “శుక్రవారం గ్రీన్ డే” గా పాటిస్తూ పశుసంవర్ధక శాఖ, సినిమాటోగ్రఫీ  తలసాని శ్రీనివాస్ యాదవ్ నేడు మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ శుక్రవారం గ్రీన్ డే పాటించాలని ఆయన కోరారు. అంబర్ పేట్ నియోజకవర్గంలోని రామకృష్ణ నగర్ పార్క్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, కార్పొరేటర్ పద్మావతి డిపి రెడ్డి కూడా మొక్కలు నాటారు.

బాగ్‌ అంబర్‌పేటర్ ప్రాంతంలోని వివిధ ప్రాంతాలలో మొక్కల పెంపకానికి ఉన్న అవకాశాలను పరిశీలించడానికి మంత్రి, ఎమ్మెల్యే అధికారులతో కలిసి మోహిని చెరువు వద్ద ఉన్న ప్రదేశం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో చిట్టాడి నర్సింహ రెడ్డి, గిరిధర్ గౌడ్, నాగేష్ గౌడ్, శ్రీనివాస్ యాదవ్, కృష్ణ గౌడ్, కిషోర్, ఆఫ్రోజ్, అరుణ్ కుమార్, జమీల్, అంజీ, ఎంఎస్ రెడ్డిచంద్ర మోహన్, ఎం. రవి, నవీన్, మహేష్, లక్ష్మణ్, దుర్గా, నిర్మల, శ్రావంతి, వాణి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Related posts

ట్రాక్టర్స్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ ల సమస్యలను పరిష్కరిస్తాం

Satyam NEWS

ముద్రగడ ఖబడ్దార్: కాపు నాయకుల హెచ్చరిక

Satyam NEWS

ఆపరేషన్ క్యాట్ ఫిష్: ఈటలతో వెళ్లకుంటే పదవి గ్యారెంటీ

Satyam NEWS

Leave a Comment