28.7 C
Hyderabad
May 6, 2024 08: 18 AM
Slider ప్రత్యేకం

గిరిజన బిడ్డ పోరాటానికి దిగివచ్చిన ప్రభుత్వం..

#girijan

ఏదైనా ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడితేనే ఫలితాలు సాధించగలమని  నిరూపించారు మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అనుచరుడు, నాగర్ కర్నూల్ జిల్లా  కొల్లాపూర్ మాజీ జెడ్పిటిసి, గిరిజన బిడ్డ హనుమంతు నాయక్.

పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్ లో భూ నిర్వాసితులకు నష్టపరిహారం అందలేదని ఆయన గత మూడు రోజులుగా  పాలమూరు-రంగారెడ్డి ప్యాకేజీ2 పనులని అడ్డుకొని నిరసన వ్యక్తం చేశారు. బోడబండ తండా, సున్నపు తండా, వడ్డే గుడిసెలు, దూల్యా నాయక్ తండా, అంజనగిరి, నార్లాపూర్ గ్రామాల వాసులు ఈ నెల 11,12,13 తేదీలలో అంజనగిరి జలాశయం కట్టా మీద ముంపు బాధితులకు నష్ట పరిహారాన్ని చెల్లించాలని కోరుతూ  కొల్లాపూర్ మాజీ జడ్పిటిసి హన్మంతు నాయక్  నాయకత్వంలో  పోరాటం చేశారు.

కొల్లాపూర్ కాంగ్రెస్ నేత రంగినేని అభిలాష్ రావు సంఘీభావం తెలిపి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.బిజేపి నాయకులు, బాధితుల నిరసనకు మద్దతు పలికారు.అయితే పోరాట  ఫలితంగానే R&R ప్యాకేజీ లో 117 ఇండ్లకు ప్రభుత్వం వారి ఖాతాలలో 12,54,000 రూపాయలను జమ చేసింది. అంజనగిరి గ్రామాని తాత్కాలికంగా సిప్టు చేయడం కోసం పది ఎకరాల భూమిని చురుకుగా చదును చేస్తున్నారని ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఇంకా రావలసిన నష్ట పరిహారాన్ని వెంటనే ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు.

మాజీ జెడ్పిటిసి హనుమంతు నాయక్. లేనిచో భూ నిర్వాసితుల పోరాటం అలాగే కొనసాగుతుందని హెచ్చరించారు. ఈ మూడు రోజులు జరిగిన పోరాటంలో భాగస్వాములు అయి మా పోరాటానికి మద్దతు ఇచ్చిన గిరిజన సంఘాల నాయకులకు, కార్యకర్తలకు, వివిధ రాజకీయ పార్టీల నాయకులకు, ముంపునకు గురియైన గ్రామాల రైతులకు మా అందరి తరుపున హనుమంతు నాయక్ కృతజ్ఞతలు తెలియచేస్తున్నారు. హనుమంత్ నాయకును గిరిజన బిడ్డలు  కొనియాడుతున్నారు.

అవుట రాజశేఖర్ సత్యం న్యూస్.నెట్, కొల్లాపూర్

Related posts

చేతి వృత్తుల వారిని అవమానపరిచిన సీఎం జగన్

Bhavani

పైడితల్లి అమ్మ‌వారిని దృష్టిలో ఉంచుకునేనైనా రోడ్లు బాగు చేయించండి…!

Satyam NEWS

విద్యార్ధి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన టీచర్ అరెస్టు

Bhavani

Leave a Comment