39.2 C
Hyderabad
April 28, 2024 12: 26 PM
Slider కర్నూలు

విద్యార్ధి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన టీచర్ అరెస్టు

#Teacher arrested

స్కూల్ విద్యార్థిని పట్ల ఓ అధ్యాపకుడు అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక తల్లిదండ్రులు దిశ SOS కు కాల్ చేసి ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు టీచర్ పై కేసు నమోదు చేసారు. ఈ సంఘటన నంద్యాల జిల్లా నందికొట్కూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నందికొట్కూరు లోని ఓ పాఠశాలలో 7 వ తరగతి చదువుతున్న విద్యార్ధిని పట్ల అదే స్కూల్ లో పని చేస్తున్న ప్రమోద్ అనే టీచర్ అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక తల్లిదండ్రులకు విషయం తెలిసి దిశ SOS కు కాల్ చేసి ఫిర్యాదు చేశారు. బాధితుల ఇంటికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు.

స్కూల్ లో పని చేస్తున్న కాంట్రాక్ట్ టీచర్ ప్రమోదు ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. బాలిక కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అధ్యాపకుడి పై 294 B సెక్షన్ కింద నందికొట్కూరు పోలీసులు కేసు నమోదు చేశారు.

Related posts

క్యూరియాసిటీ పెంచుతున్న విజయ్ ఆంటోనీ ‘హత్య’ మోషన్ పోస్టర్

Satyam NEWS

“గుంటూరు కారం” విజయం గిట్టనివాళ్లు కువిమర్శలు చేస్తున్నారు

Satyam NEWS

రాజధాని శిలాఫలకం మీ రాక కోసం ఎదురు చూస్తుంది

Bhavani

Leave a Comment