27.7 C
Hyderabad
May 4, 2024 10: 35 AM
Slider ముఖ్యంశాలు

నిరంకుశ పాలనను ఎదిరించిన యోధుడు దొడ్డి కొమురయ్య

#Revanth Reddy

నిరంకుశ పాల‌న నుంచి స్వేచ్ఛా వాయువులు పీల్చుకునేందుకు, ఆత్మ గౌర‌వ ప‌తాక‌ను ఎగుర‌వేసేందుకు ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టిన యోధుడు దొడ్డి కొముర‌య్య అని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొముర‌య్య జ‌యంతిని పుర‌స్క‌రించుకొని ఆయ‌న త్యాగాన్ని, ఆయ‌న ఉద్య‌మ స్ఫూర్తిని ముఖ్య‌మంత్రి గుర్తు చేసుకున్నారు.  రాష్ట్రంలో నియంతృత్వ‌ పాల‌న నుంచి విముక్తి పొంది ప్ర‌జా పాల‌న ఏర్ప‌డేందుకు దొడ్డి కొముర‌య్య ఉద్య‌మ స్పూర్తిని అందిపుచ్చుకున్న‌ట్లు ముఖ్య‌మంత్రి తెలిపారు. తెలంగాణ సాయుధ పోరులో తొలి అమ‌రుడైన దొడ్డి కొముర‌య్య త్యాగం చిర స్మ‌ర‌ణీయ‌మ‌ని, ఆయ‌న ఆశ‌య సాధ‌న‌కు త‌మ ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని ముఖ్య‌మంత్రి వెల్ల‌డించారు.

బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల అభ్యున్న‌తే ధ్యేయంగా త‌మ ప్ర‌భుత్వం ప‌ని చేస్తోంద‌ని, ఈ క్ర‌మంలోనే పేద కుటుంబాల‌కు రెండొంద‌ల యూనిట్ల వ‌ర‌కు ఉచిత విద్యుత్ స‌ర‌ఫ‌రా, రూ.500కే గ్యాస్ సిలిండ‌ర్ పంపిణీ, మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప్ర‌యాణం, ఇందిరమ్మ ఇళ్లు, బీసీ వ‌ర్గాల అభ్యున్న‌తి కోసం వివిధ సంక్షేమ ప‌థ‌కాలు, రాయితీలు అందిస్తున్న‌ట్లు ముఖ్య‌మంత్రి తెలిపారు. నియంతృత్వ పాల‌న నుంచి విముక్తికి సాగిన సాయుధ పోరాటం, సాయుధ పోరాట యోధుల నుంచి స్ఫూర్తిని పొంది వారి ఆశ‌యమైన ప్ర‌జా పాల‌న సాగిస్తున్నామ‌ని, ప్ర‌తి ఒక్క‌రి అభిప్రాయాల‌కు విలువ‌నిస్తూ, ప్ర‌తి ఒక్క‌రూ స్వేచ్ఛ‌గా త‌మ అభిప్రాయాలు వెల్ల‌డించే అవ‌కాశం క‌ల్పించామ‌ని, మంత్రివ‌ర్గం మొదలు అన్ని నియామ‌కాల్లో  సామాజిక న్యాయానికి పెద్ద‌పీట వేస్తున్నామ‌ని ముఖ్య‌మంత్రి వెల్ల‌డించారు. తెలంగాణ సాయుధ పోరాట తొలి అమ‌రుడు దొడ్డి కొమురయ్య జయంతి సందర్భంగా ఆయ‌న‌కు ఘ‌న నివాళి అర్పిస్తున్న‌ట్లు ముఖ్య‌మంత్రి తెలిపారు.

(ఏప్రిల్ 03వ తేదీ దొడ్డి కొమురయ్య జయంతి)

Related posts

భద్రాచలం  ఆర్డీఓ గా రత్నకల్యాణి

Murali Krishna

ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘ సర్వసభ్య సమావేశం

Satyam NEWS

తెలుగు వదిలేస్తే తల్లిని వదిలేసినట్లే

Satyam NEWS

Leave a Comment